ఐపీఎల్‌లో తొమ్మిదో జట్టుకు ఎంట్రీ ఇవ్వాలంటే 2021 సీజన్‌కు బీసీసీఐ మెగా వేలాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. ఐతే అలాంటి ఆక్షన్ నిర్వహిస్తే ఎంఎస్ ధోనీని వదులుకోవడమే చెన్నై జట్టుకు మంచిదంటూ మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోనీని విడిచిపెట్టిన తర్వాత రైట్ టూ కార్డ్ ద్వారా తిరిగి జట్టులోకి తీసుకుంటే లాభం ఉంటుందని చెప్పాడు. అలాకాకుండా రిటైన్డ్ ప్లేయర్‌గా జట్టుతో కొనసాగిస్తే ఎక్కువ మొత్తంలో డబ్బును నష్టపోతారని ఆకాశ్ అన్నాడు.
మెగావేలంలో తీసుకున్న ఆటగాడు మూడేళ్ల పాటు జట్టుతో ఉంటాడు. మరి మాహీ మూడేళ్లు ఆడతాడా అంటూ ఆకాశ్ అన్నారు. ఐతే ధోనీని తీసుకోవద్దని తన ఉద్దేశం కాదని అతడు తర్వాత సీజన్ తప్పక ఆడతాడని అన్నాడు. అతడిని రిటైన్డ్ ప్లేయర్‌గా జట్టుతో కొసాగిస్తే కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఒకవేళ ధోనీ మూడేళ్లు ఆడకుండా 2021 సీజన్ మాత్రమే ఆడితే, 2020 సీజన్‌లో కోట్లు మిగులుతాయని లెక్కలు చెప్పాడు. ఆ మొత్తానికి తగిన సామర్థ్యం ఉన్న ఆటగాడిని తర్వాత సొంతం చేసుకోగలరా? అందుకే మెగా వేలంలో ఎక్కువ మొత్తాన్ని వెచ్చించి బలమైన జట్టును తయారుచేసుకోవడం ఉత్తమమని అన్నాడు ఆకాశ్. మరి ఇతని వ్యాఖ్యలపై ధోని ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.