WTC Final Date 2021: మ్యాచ్ ను అడ్డుకుంటున్న మిస్టర్ వరుణుడు
WTC Final Date 2021: వర్షాకాలంలో మ్యాచ్ షెడ్యూల్ ఫిక్స్ చేసినందుకు క్రికెట్ అభిమానులు ఐసీసీని దుమ్మెత్తి పోస్తున్నారు.
WTC Final Date 2021: జరక్క జరక్క ఒక్క మ్యాచ్.. అది కూడా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ ఫైనల్స్. అది కూడా ఇండియా న్యూజిలాండ్ ల మధ్య. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. మిస్టర్ వరుణ్ వారి ఆశలు అడియాసలు చేసేటట్లున్నాడు. ఇప్పటికే సౌతాంప్టన్ స్టేడియంలో వర్షం పడుతోంది. మ్యాచ్ టైమ్ కి ఆగుతుందో లేదో కష్టమే అంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో స్పోర్ట్స్ అవర్స్ ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. వర్షం పడుతుందని తెలిసీ .. ఈ స్టేడియం ఎలా సెలెక్ట్ చేశారని మండిపడుతున్నారు.
ఐసీసీ (ICC) అరంగేట్రం డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్నది. ఇండియా (India), న్యూజీలాండ్ (New Zealand) జట్లు సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియంలో (Rose Bowl Stadium) తలపడనున్నాయి. మ్యాచ్ సమయం దగ్గర పడుతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనపడుతున్నా.. న్యూజీలాండ్‌కే కాస్త ఎడ్జ్ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరో వైపు ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను 1-0తో గెలుచుకున్న న్యూజీలాండ్‌ను చూసి టీమ్ ఇండియా ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ మ్యాచ్‌కు సంబంధించి ట్రోల్స్ కూడా ఎక్కువయ్యాయి. ఎవరు మ్యాచ్ గెలుస్తారంటూ మీమ్స్ ద్వారా ప్రెడిక్షన్స్ చెబుతున్నారు.
ఇక ఈ మ్యాచ్‌కు వర్షం కూడా అడ్డు పడుతుందని చెబుతున్నారు. శుక్రవారం ఉదయం నుంచి సౌతాంప్టన్‌లో భారీగా వర్షం పడుతున్నది. దీంతో రోజ్ బౌల్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. ప్రస్తుతానికి పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. అయితే మ్యాచ్ ప్రారంభమయ్యే సరికి వర్షం తగ్గి ఔట్ ఫీల్డ్ ఆరుతుందా లేదా అనేది అనుమానంగా మారింది. మరోవైపు క్రికెట్ అభిమానులు ఐసీసీని దుమ్మెత్తి పోస్తున్నారు. వర్షాకాలంలో మ్యాచ్ షెడ్యూల్ చేసినందుకు విరుచుకపడుతున్నారు.