వింటర్‌ ఒలింపిక్స్‌పై కోవిడ్‌ ఎఫెక్ట్.. కోవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో...

Winter Olympics 2022 - Beijing: *టియాంజిన్‌లో 20 మందికి కరోనా *బాధితుల్లో ఇద్దరికి ఒమిక్రాన్‌ నిర్ధారణ

Update: 2022-01-10 03:28 GMT

వింటర్‌ ఒలింపిక్స్‌పై కోవిడ్‌ ఎఫెక్ట్.. కోవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో...

Winter Olympics 2022 - Beijing: వింటర్‌ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతోన్న చైనాను కోవిడ్‌ మరోసారి వెంటాడుతోంది. ఇప్పటికే షియాన్‌ నగరంలో కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తోంది. అయినప్పటికీ కరోనా కేసులు వెలుగు చూస్తుండటంతో చైనా భయాందోళనలకు గురవుతోంది. తాజాగా నమోదైనవాటిల్లో ఒమిక్రాన్‌ కేసులు కూడా బటయపడటంతో చైనా కలవరపడుతోంది.

టియాంజిన్‌లో తాజాగా 20 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. బాధితుల శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపగా.. అందులో ఇద్దరికి ఒమిక్రాన్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ వైరస్‌.. వేగంగా వ్యాప్తి చెందే గుణం కలిగి ఉండటంతో.. చైనా కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని కోటిన్నర మందికి కొవిడ్‌ టెస్టులు చేసే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. డిసెంబర్‌లోనే టియాంజిన్‌లో ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూసినప్పటికీ.. ఆ తర్వాత దాని జాడ కనపడలేదు. దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు.. ఇప్పుడు మరోసారి ఒమిక్రాన్‌ కేసులు నిర్ధారణ కావడంతో కొంద ఆందోళనకు గురవుతున్నారు.

మరోవైపు.. ఫిబ్రవరి 4 నుంచి వింటర్‌ ఒలింపిక్స్‌ మొదలుకానున్నాయి. అయితే.. ప్రస్తుతం కోవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో చైనా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మహమ్మారి బీజింగ్‌కు వ్యాప్తి చెందకుండా నివారించేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు. ప్రస్తుతం చైనాలో 3వేల 392 మంది కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో 26 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ వెల్లడించింది.

Tags:    

Similar News