CSK vs SRH: హైదరాబాద్‌పై చెన్నై విజయం; రుతిరాజ్ అద్భుత ఇన్నింగ్స్
CSK vs SRH: హైదరాబాద్ పై చెన్నై 7 వికెట్ల తేడా తో గెలిచింది. భారీ లక్ష్యాన్ని చెన్నై ఓపెనర్లు ఊదిపారేశారు.
CSK vs SRH: హైదరాబాద్ పై చెన్నై 7 వికెట్ల తేడా తో గెలిచింది. భారీ లక్ష్యాన్ని చెన్నై ఓపెనర్లు ఊదిపారేశారు. మరోసారి హైదరాబాద్ కు ఓటమి తప్పలేదు. దీంతో లీగ్ దశలోనే చివరిస్థానంలో మిగిలిపోయింది.
172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన చెన్నై టీం కే అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు రుతిరాజ్, డుప్లెసిస్ 129 పరుగుల భాగస్వామ్యం అందిచారు. ఇద్దరు కూడా మంచి ఫాంలో ఉండడంతో చెన్నై విజయానికి నాంది పలికారు. ధాటిగా ఆడుతూ పరుగులు సాధించారు.
వీరి వికెట్లు తసేందుకు హైదరాబాద్ బౌలర్తు తీవ్రంగా కష్టపడ్డారు. ఎట్టకేలకు 12.6 ఓవర్లో రుతిరాజ్(75 పరుగులు, 44 బంతులు, 12ఫోర్లు) రషీధ్ ఖాన్ బౌలింగ్ బౌల్డ్ అయ్యాడు.
ఆ తరువాత డుప్లెసిస్(56పరుగులు, 38 బంతులు, 6ఫోర్లు, 1 సిక్స్) కూడా రషీద్ ఖాన్ బౌలింగ్ లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ వెంటనే మొయిన్ అలీ రూపంలో మూడో వికెట్ సాధించాడు రషీద్ ఖాన్.
అప్పటికే చెన్నై విజయానికి చేరువైంది. అనంతరం రవీంద్ర జడేజా(7), సురేష్ రైనా(17) చెన్నై టీంను విజయాన్ని అందించారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ టీం.. త్వరగానే ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(7) వికెట్ ను కోల్పోయింది. సామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో 7 పరుగులు చేసిన బెయిర్ స్టో చహర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అనంతరం బ్యాటింగ్ వచ్చిన మనీష్ పాండే తో కలిసి వార్నర్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ధాటిగానే ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. బౌలింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్న చెన్నై టీం హైదరాబాద్ ముందు తేలిపోయింది. వికెట్లు తీసేందుకు ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం దక్కలేదు.
వార్నర్, పాండే కలిసి సెంచరీ భాగస్వామ్యంతో ఆకట్టుకున్నారు. భారీ స్కోర్ దిశగా సాగుతున్న ఈ జోడీని 17.1 ఓవర్లో ఎంగిడి విడదీశాడు. వార్నర్ (57 పరుగులు 55 బంతులు, 3ఫోర్లు, 2సిక్సులు) జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అదే ఓవర్ లో చివరి బంతికి మనీష్ పాండే (61పరుగులు, 46 బంతులు, 5ఫోర్లు, 1సిక్స్) ను పెవిలియన్ పంపించాడు ఎంగిడి. దీంతో విలువైన భాగస్వామ్యాన్ని విడదీసి భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. ఆ తరువాత బ్యాటింగ్ వచ్చిన కేన్ మామ(25పరుగులు, 8 బంతులు, 4ఫోర్లు, 1సిక్స్) శార్దుల్ ఠాకూర్ ను ఉతికి ఆరేశాడు. 19 ఓవర్ వేసిన శార్దుల్... ఆ ఓవర్లో కేన్ మామ ధాటికి 20 పరుగులు సమర్పించుకున్నాడు.