IPL 2021 CSK vs RR: రాజస్థాన్ రాయల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం

IPL 2021 CSK vs RR: ప్రత్యర్థికి అవకాశమే ఇవ్వకుండా వికెట్ల మీద వికెట్లు తీసిన చెన్నై ఘన విజయం సాధించింది.

Update: 2021-04-20 01:40 GMT

IPL 2021 CSK vs RR:(Twitter Photo)

IPL 2021 CSK vs RR: ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ పై తన ప్రతాపం చూపించి విజయం సాధించింది. టీ 20 మ్యాచ్ లో ఎలా ఆడాలో ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడి చూపించింది. మొదట జట్టులో ఎవరూ భారీ స్కోరు చేయకున్నా సరే.. క్రీజులోకి దిగిన ప్రతి బ్యాట్స్‌మెన్‌ దంచు దంచు అన్నట్లుగా రెచ్చిపోవడంతో భారీ స్కోరు చేసిన సూపర్‌కింగ్స్‌.. తర్వాత బంతితోనూ విజృంభించింది. ప్రత్యర్థికి అవకాశమే ఇవ్వకుండా వికెట్ల మీద వికెట్లు తీసిన చెన్నై బౌలర్లు చాలా ముందుగానే విజయాన్ని ఖాయం చేశారు. శిఖ‌ర్ ధావ‌న్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి కేవ‌లం 49 బంతుల్లో 92 ప‌రుగులు సాధించి జ‌ట్టు విజ‌యంలో కీలకం అయ్యాడు. చివరివరకు ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది.

చెలరేగిన చెన్నై సూపర్ కింగ్స్....

గత సీజన్‌ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ ఓటమితో ఐపీఎల్‌-14ను ఆరంభించిన చెన్నై.. ఆ వైఫల్యం నుంచి త్వరగానే బయటపడింది. గత మ్యాచ్‌లో పంజాబ్‌కు పెద్ద షాకిస్తూ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసిన ఆ జట్టు.. సోమవారం రాజస్థాన్‌ రాయల్స్‌పై 45 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట చెన్నై 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ (33; 17 బంతుల్లో 4×4, 2×6) టాప్‌స్కోరర్‌. రాజస్థాన్‌ బౌలర్లలో సకారియా (3/36), మోరిస్‌ (2/33) రాణించారు. అనంతరం మొయిన్‌ అలీ (3/7), సామ్‌ కరన్‌ (2/24), జడేజా (2/28)ల ధాటికి రాయల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులే చేసింది. ఆ జట్టులో బట్లర్‌ (49; 35 బంతుల్లో 5×4, 2×6) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు.

రాయల్స్‌ ఆశలన్నీ బట్లర్‌, శాంసన్‌ల మీదే...

భారీ లక్ష్యం ముందుండగా రాయల్స్‌ ఆశలన్నీ బట్లర్‌, శాంసన్‌ల మీదే నిలిచాయి. కానీ ఆ జట్టు బ్యాటింగ్‌ మూల స్తంభం, కెప్టెన్‌ శాంసన్‌ (1) ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో రాయల్స్‌కు పరాభవం తప్పదని తేలిపోయింది. వోహ్రా (14)తో పాటు శాంసన్‌ను ఔట్‌ చేసి రాజస్థాన్‌ను పెద్ద దెబ్బే కొట్టాడు సామ్‌ కరన్‌. అయితే జోస్‌ బట్లర్‌ తనదైన శైలిలో చెలరేగి ఆడటం, దూబె (17) అతడికి అండగా నిలవడం.. వెనుక మిల్లర్‌, తెవాతియా, మోరిస్‌ లాంటి హిట్టర్లుండటంతో రాయల్స్‌ ఏదైనా అద్భుతం చేస్తుందేమో అనిపించింది. కానీ 12వ ఓవర్లో, జట్టు స్కోరు 87 వద్ద బట్లర్‌ను బౌల్డ్‌ చేసిన జడేజా.. రాయల్స్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. దూబెను సైతం అతనే ఔట్‌ చేశాడు. తర్వాత మొయిన్‌ అలీ రెండు ఓవర్ల వ్యవధిలో మిల్లర్‌ (2), పరాగ్‌ (3), మోరిస్‌ (0)లను ఔట్‌ చేసి చెన్నై విజయాన్ని లాంఛనంగా మార్చాడు.

చెన్నై ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 33... 

చెన్నై ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 33 మాత్రమే. ఓపెనర్‌ డుప్లెసిస్‌ సాధించాడు. ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయింది. అయినా సరే.. 188 పరుగులు చేయడం విశేషమే. క్రమం తప్పకుండా ఆ జట్టు వికెట్లు కోల్పోయినప్పటికీ.. బ్యాట్స్‌మెన్‌లో ఎక్కువ మంది క్రీజులోకి వచ్చీ రాగానే బాదుడు మంత్రం పఠించడంతో ఆ జట్టు భారీ స్కోరు చేయగలిగింది. రుతురాజ్‌ (10) మరోసారి త్వరగా వెనుదిరిగినప్పటికీ.. డుప్లెసిస్‌, మొయిన్‌ అలీ (26; 20 బంతుల్లో 1×4, 2×6) చెలరేగిపోవడంతో చెన్నై స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీళ్లిద్దరూ తక్కువ వ్యవధిలో వెనుదిరిగినా.. తర్వాత వచ్చిన రాయుడు (27; 17 బంతుల్లో 3×6) సైతం భారీ షాట్లతో రాయల్స్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రైనా (18) మాత్రమే కొంచెం నెమ్మదిగా ఆడాడు. రాయుడు, రైనాలను సకారియా ఒకే ఓవర్లో పెవిలియన్‌ చేర్చడంతో చెన్నై జోరు కాస్త తగ్గింది. ధోని (18; 17 బంతుల్లో 2×4) అంత ధాటిగా ఆడలేకపోయాడు. అతను జోరు పెంచే సమయానికి సకారియా పెవిలియన్‌ చేర్చాడు. అయితే సామ్‌ కరన్‌, బ్రావో (20 నాటౌట్‌) చివర్లో వీలైనన్ని షాట్లు ఆడటంతో చెన్నై అనుకున్న దానికంటే ఎక్కువ స్కోరే చేసింది.

నేడు ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. చెన్నై వేదికగా ఈ రోజు రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Tags:    

Similar News