T20 World Cup Squad: హార్దిక్ పాండ్యపై వేటు.. శార్దుల్ టాగూర్ కి చోటు..!!

* టీ20 వరల్డ్ కప్ తుది జట్టు నుండి హార్దిక్ పాండ్యని పక్కనపెట్టనున్న బిసిసిఐ

Update: 2021-09-28 10:11 GMT

 హార్దిక్ పాండ్యపై వేటు.. శార్దుల్ టాగూర్ కి చోటు (ఫైల్ ఫోటో)

T20 World Cup Squad: భారత క్రికెట్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య అటు వన్డే క్రికెట్ లోనే కాకుండా పొట్టి క్రికెట్ లోను తన సత్తా చాటుతూ టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యకి బిసిసిఐ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల శ్రీలంక పర్యటనలో జరిగిన వన్డే, టీ20 సిరీస్ లో ఘోరంగా విఫలమైన హార్దిక్ పాండ్య.. తాజాగా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఇటీవల జరిగిన మ్యాచ్ లలో తన పేలవ ఆటతీరుతో అభిమానులను హార్దిక్ మరోసారి నిరాశపరిచాడు.

అటు బౌలింగ్ వేయకుండా ఇటు బ్యాటింగ్ లోనూ విఫలం అవడంతో ఇప్పటికే త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్ తుదిజట్టులో చోటు సంపాదించుకున్న హార్దిక్ పాండ్యపై వేటు పడనుంది. ప్రస్తుతం తన ప్రదర్శన సరిగ్గా లేనందున భారత జట్టుకు బ్యాకప్ ప్లేయర్ గా పరిమితమయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యని పక్కనపెడితే అతడి ఆల్ రౌండర్ స్థానంలో శార్దుల్ టాగూర్ ని తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ బ్యాకప్ టీంలో ఉన్న శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున జరిగిన రెండు మ్యాచ్ లలో తన నిలకడైన ఆటతో ఆకట్టుకోవడంతో ఇషాన్ కిషన్ లేదా సూర్యకుమార్ యాదవ్ లలో ఎవరో ఒకరిని పక్కనపెట్టి శ్రేయాస్ కి తుదిజట్టులో చోటుదక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిసిసిఐ వర్గాల నుండి సమాచారం. దీంతో తుది జట్టును మార్చుకునే అవకాశం అక్టోబర్ 10 వరకు ఉన్నందున బిసిసిఐ కూడా ప్రస్తుతం ఐపీఎల్ లో ఆటగాళ్ళ ఫామ్ ని బట్టి త్వరలోనే జట్టులో మార్పులు, చేర్పులు ఉండనున్నాయని తెలిపారు.

ప్రస్తుతానికి హార్దిక్ ఆటతీరు అంతగా బాగాలేనందున తుది జట్టులో స్థానం కష్టమేనని బిసిసిఐ చెప్పకనే చెబుతుంది. ఇక ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు ఆశిష్ నెహ్రా స్పందించాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య స్థానాన్ని శార్దుల్ టాగూర్ భర్తీ చేయలేడని గత కొన్ని మ్యాచ్ లలో శార్దుల్ ఆటతీరు బాగుందని, హార్దిక్ పరుగులు సాధించలేదని జట్టులో నుండి వేటు వేయడం సరైనది కాదని తాజాగా నెహ్రా ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు.    

Tags:    

Similar News