కెప్టెన్సీ నుండి తప్పుకోమని విరాట్ కోహ్లికి 2 రోజులు సమయం ఇచ్చిన బీసీసీఐ..!?

Update: 2021-12-09 06:47 GMT

కెప్టెన్సీ నుండి తప్పుకోమని విరాట్ కోహ్లికి 2 రోజులు సమయం ఇచ్చిన బీసీసీఐ..!? 

Virat Kohli: వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లిని తప్పిస్తూ బీసీసీఐ షాక్ ఇచ్చింది. తాజా సమాచారం ప్రకారం దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టు ఎంపిక నేపథ్యంలో వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని బీసీసీఐ విరాట్ కోహ్లీకి 48 గంటలు సమయం ఇచ్చినట్లు తెలుస్తుంది. అందుకు విరాట్ కోహ్లి మాత్రం కెప్టెన్సీని వదులుకోడానికి ఒప్పుకోకపోవడంతో బీసీసీఐ తమ ప్రకటనలో కోహ్లీని తప్పిస్తున్నట్లు చెప్పకుండానే వన్డే, టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉంటాడని సెలెక్షన్ కమిటీతో ప్రకటన చేయించింది.

బీసీసీఐ తీసుకున్న నిర్ణయం విరాట్ కి అస్సలు నచ్చలేదని అతడి సన్నిహిత వర్గాల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. "2023 వన్డే ప్రపంచకప్‌ వరకు టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లి కొనసాగాలనుకున్నాడని, జట్టు కోసం విరాట్ ఎన్నో చేశాడని అలాంటి వ్యక్తిని ఇలా అవమానపరచడం కరెక్ట్ కాదని" కోహ్లీ సన్నిహిత వర్గాలు తెలిపాయని ఒక ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ తెలిపింది. వన్డే ప్రపంచకప్ కోసం కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అంతేకాకుండా ఆర్‌సీబీ కెప్టెన్సీని వదిలేశాడు.

Tags:    

Similar News