Ranji Trophy 2022: ఓ వైపు కుమార్తె మరణం.. మరోవైపు రంజీలో కీలక మ్యాచ్..
Ranji Trophy 2022: బరోడా బ్యాటర్ విష్ణు సోలంకి రియల్ హీరో అనిపించుకున్నాడు.
Ranji Trophy 2022: బరోడా బ్యాటర్ విష్ణు సోలంకి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఓవైపు అప్పుడే పుట్టిన కన్న కూతురు మరణించందన్న వార్త వేధిస్తున్నా జట్టు కోసం బ్యాట్ పట్టి సెంచరీతో కదం తొక్కి శభాష్ అనిపించుకున్నాడు. కన్నకూతురు ఇక లేదన్న వార్తను దిగమింగుతూ కఠిన పరిస్థితుల్లో సెంచరీ చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. బిడ్డకు జన్మనిచ్చిన కొద్ది క్షణాల్లో ఆ బిడ్డ మరణించింది. శోకసంద్రంలో ఉండగా అంతకుముందే రంజీ ట్రోఫీలో బరోడా జట్టు నుంచి విష్ణుకు పిలుపు వచ్చింది. పాప మృతిచెందిన బాధతోనే అంత్యక్రియలను పూర్తి చేసిన విష్ణు వెంటనే బరోడా జట్టులో చేరాడు. అంతటి దుంఖంలోనూ ఛత్తీసగడ్‌తో మ్యాచ్‌లో విష్ణు సోలంకి 104 పరుగుల అద్బుతమైన సెంచరీ చేసి బరోడా జట్టుకు భారీ ఆధిక్యం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు.
విష్ణు సోలంకిపై సర్వత్రా ప్రశంసలతో పాటు సంఘీభావం సందేశాలు వ్యక్తమవుతున్నాయి. బరోడా క్రికెట్ అసోసియేషన్ సీఈవో శిశిర్ హట్టన్‌గాడి ట్విటర్ వేదికగా స్పందిస్తూ విష్ణు ఓ స్పూర్తి ప్రదాత అని కొనియాడరు. ఈయనతో పాటు అనేకమంది క్రికెటర్లు విష్ణును కొనియాడారు.