Bangladesh Vs Australia 2nd T20I : బంగ్లాదేశ్ టూర్ లో ఉన్న ఆస్ట్రేలియా జట్టు అయిదు టీ20 ల్లో భాగంగా బుధవారం జరిగిన మొదటి టీ20 లో ఓటమిని మరువక ముందే గురువారం ఢాకాలో జరిగిన రెండో టీ 20 లోనూ చతికిలపడి ఆస్ట్రేలియా జట్టు మరో ఘోర ఓటమిని చవిచూసింది. మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణిత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఇక ఆస్ట్రేలియా జట్టులో మిచెల్ మార్ష్ 45, మొయినిస్ హెన్రీక్స్ 30 పరుగులు మినహా ఎవరు రాణించకపోవడంతో ఆస్ట్రేలియా 121 పరుగులతో సరిపెట్టుకుంది. ఇక బంగ్లాదేశ్ బౌలింగ్ లో ముస్తాఫీజర్ రెహ్మాన్ 3, ఇస్లామ్ 2, హసన్ మరియు షకిబ్ ఉల్ హసన్ లు చెరొక వికెట్ లు తీశారు.
ఇక 122 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఓపెనర్లు మహమ్మద్ నయీం, సౌమ్య సర్కార్ లు ఆరంభంలోనే అవుట్ అయిన హసన్ మరియు షకిబ్ ఉల్ హసన్ భాగసౌమ్యంతో మ్యాచ్ విజయానికి పునాది వేశారు. ఇక ఈ ఇద్దరి భాగాసౌమ్యాన్ని విడదీసిన ఆసీస్ తరువాత బ్యాటింగ్ దిగిన మహ్మదుల్ల డక్ అవుట్ అవడంతో ఆసీస్ జట్టు విజయం సాధించబోతుందన్న తరుణంలో బంగ్లాదేశ్ కీపర్ నురుల్ హసన్ 22 ,ఆసిఫ్ హుస్సేన్ 37 పరుగులతో నాటౌట్ గా నిలిచి 18.4 ఓవర్లలో 121/7 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఆసీస్ విజయపు ఆశలకు నీళ్ళు చల్లారు. ఇక చేజింగ్ లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ లో రాణించిన ఆసిఫ్ హుస్సేన్ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక అయిదు టీ 20 లలో భాగంగా బంగ్లాదేశ్ 2-0 తో ఆధిక్యంలో ఉంది.ఇక ఆసీస్ తో మూడో టీ 20 మ్యాచ్ శుక్రవారం జరగనుంది.