SRH VS RCB: సన్ రైజర్స్ హైదరాబాద్ కు బెంగళూరు స్ట్రోక్

SRH VS RCB: 35 పరుగుల తేడాతో బెంగళూరు విజయం

Update: 2024-04-26 04:10 GMT

SRH VS RCB: సన్ రైజర్స్ హైదరాబాద్ కు బెంగళూరు స్ట్రోక్

SRH VS RCB: సన్ రైజర్స్ దూకుడుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కళ్లెం వేసింది. ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బెదరగొట్టిన ఉప్పల్ స్టేడియం వేదికగా బెంగళూరు జట్టు అదరగొట్టింది. 35 పరుగుల తేడాతో రెండో విజయానని చేజిక్కించుకుంది. టాస్ గెలిచిన బెంగళూరు మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. వ్యక్తిగతంగా తక్కువ బంతుల్లో 50 పరుగుల స్కోరు సాధించి, జట్టుస్కోరు పెరుగుదలకు, జట్టువిజయానికి కీలకపాత్ర పోషించిన రాజత్ పాటిదర్ ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 206 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 51 పరుగులతో టాప్ స్కోరర్ కాగా, రాజత్ పాటిదర్ 50 పరుగులు, కెమరాన్ గ్రీన్ 37 పరుగులు, కెప్టెన్ డుప్లెసిస్ 25 పరుగులు, స్వప్నిల్ సింగ్ 12 పరుగులు, దినేశ్ కార్తిక్ 11 పరుగులు అందించారు.

207 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే హంసపాదులా మారింది. స్టార్ బ్యాట్స్ మెన్ ట్రావిస్ హెడ్ తొలిఓవర్ ఆఖరు బంతికి వెనుదిరిగాడు. నాలుగో ఓవర్లో అభిషేక్ శర్మ, ఐదో ఓవర్లో ఎయిడెన్ మార్కరం, హెన్రిచ్ క్లాసెన్ ఇద్దరూ వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో హైదరాబాద్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. షాబజ్ అహ్మద్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కెప్టన్ ప్యాట్ కమిన్స్ 31, అభిషేక్ శర్మ 31 పరుగులు అందించారు. మిగిలిన వారెవ్వరూ ఆశించినంతగా రాణించలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టు 171 పరుగులు చేయగలిగింది. 35 పరుగుల తేడాతో బెంగళూరు జట్టు విజయాన్ని కైవసం చేసుకుంది.

Tags:    

Similar News