HCA: రసాభాసగా హెచ్‌సీఏ సమావేశం..తిట్టుకున్న అజారుద్దీన్, విజయానంద్

HCA: హెచ్ సీఏ సమావేశంలో ప్రెసిడెంట్ అజార్‌, సెక్రెటరీ విజయానంద్‌ దారుణంగా తిట్టుకున్నారు.

Update: 2021-03-28 12:51 GMT

అజారుద్దీన్ ఫైల్ ఫోటో

HCA: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌ సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. ఈ సమావేశంలో స్టేజిపైనే ప్రెసిడెంట్ అజార్‌, సెక్రెటరీ విజయానంద్‌ దారుణంగా తిట్టుకున్నారు. అంబుడ్స్ మెన్ నియామకంపై ఈ వివాదం చెలరేగింది. దీపక్ వర్మను నియమించాలని అజార్ పట్టుపట్టగా...దీపక్ వర్మను అంబుడ్స్ మెన్ గా నియమించవద్దని సెక్రెటరీ విజయనంద్ తో పాటు క్లబ్ మెంబర్లు గొడవ దిగారు. దీంతో స్టేజి మీదనే తిట్టుకున్నారు అజార్, విజయనంద్. ఈ గొడవ కారణంగా ఏప్రిల్ 11వ తేదీకి సర్వ సభ్య సమావేశం వాయిదా పడింది.

ఇక అటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ.హెచ్. హెచ్‌సీఏపై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవినీతితో భ్రష్టు పట్టిపోయిందని...జిల్లాలో క్రికెట్ అభివృద్ధి ధ్యాసే లేదని ఫైర్ అయ్యారు. తెలంగాణలోని ఒక్క జిల్లాలోనూ గ్రౌండ్, స్టేడియం లేదని..ఉన్న నిధులన్నీ అపెక్స్ కౌన్సిల్ మాయం చేసిందని ఆరోపించారు. అంబుడ్స్ మెన్ ఎన్నికల్లోనూ పారదర్శకత లేదని... అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ వర్మను అంబుడ్స్ మెన్ గా ఎలా నిర్ణయిస్తారు? దీనిపై అజార్ ను ప్రశ్నిస్తే ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. హెచ్.సిఏ. ప్రెసిడెంట్ అజార్ కు అధికార పార్టీ అండదండలు వున్నాయని ఆరోపించారు. అధ్యక్షులు మారుతున్నా హెచ్​సీఏ తలరాత మారడం లేదంటూ క్రీడా సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. అంతర్గత కుమ్ములాటలు, అవినీతి ఆరోపణలకే పరిమితమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోషియేషన్‌.... హైదరాబాద్‌ కరప్షన్‌ అసోషియేషన్‌గా మారిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News