IPL 2021: ఐపీఎల్‌కు ముందు ఢిల్లీకి భారీ షాక్..అక్షర్ పటేల్‌కు కరోనా
IPL 2021:: ఐపీఎల్ సీజన్ 14 ప్రారంభానికి ముందు రోజుకో జట్టుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
IPL 2021: ఐపీఎల్ సీజన్ 14 ప్రారంభానికి ముందు రోజుకో జట్టుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ దూరమైతే.. తాజగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఆటగాడు ఢిల్లీ జట్లు కీలక ప్లేయర్ అక్షర్ పటేల్ దూరమైయ్యాడని తెలుస్తోంది.
అక్షర్ పటేల్‌కు కరోనా వైరస్ సోకిందని సమాచారం. దాంతో నిబంధనల ప్రకారం అతడిని ఐసోలేషన్‌కు తరలించినట్టు తెలుస్తోంది.'దురదృష్టవశాత్తు అక్షర్‌కు పాజిటివ్ వచ్చింది. అతడు ఏకాంతంలో ఉన్నాడు. కరోనా నిబంధనలు, ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నాం' అని ఢిల్లీ ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి.
అక్షర్ పటేల్ మార్చి 22న పాజిటివ్ రాగా.. మార్చి28న అతడు నెగెటివ్ రిపోర్డుతో శిబిరంలో అడుగుపెట్టాడు. రెండోసారి చేసిన ఆర్‌టీపీసీఆర్‌లో పాజిటివ్‌గా తేలింది. వాంఖడే వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఢిల్లీ తొలి మ్యాచులో తలపడాల్సి ఉంది. అక్షర్ కన్నా ముందు కోల్‌కతా ఆటగాడు నితీశ్ రాణా కొవిడ్ బారిన పడ్డాడు.
ఎవరైనా ఆటగాళ్లకు సోకిందని తెలిస్తే బీసీసీఐ వారికి బయోసెక్కూలర్ నుంచి వేరుచేయాలి. వారు రోజూ జట్టు వైద్యులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు బాధితులు ఎలాంటి శారీరక కసరత్తులు చేయడానికి వీల్లేదు. అక్షర్ పటేల్ భారత్-ఇంగ్లాండ్ సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. మూడు టెస్టుల్లో 27 వికెట్లు తీసి సత్తాచాటాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్ప్ అక్షర్ పటేల్ పై భారీ ఆశలు పెట్టుకుంది.