అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా - భారత్ మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. భారత్‌పై 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 90 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 21 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. దీంతో 4 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంతో ఆస్ట్రేలియా ముందుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఘోర పరాజయంతో ఇండియా చెత్త రికార్డును మూటగట్టుకుంది. రెండో టెస్టు డిసెంబర్ 26న మెల్బోర్న్లో జరగనుంది.
స్కోరు బోర్డు వివరాలు..
భారత్ తొలి ఇన్నింగ్స్ : 244 ఆలౌట్ ; కోహ్లీ 74, పుజారా 43 పరుగులు; స్టార్క్ 4 వికెట్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 191 ఆలౌట్ ; టిమ్‌పైన్ 73, లబుషేన్ 47 పరుగులు; అశ్విన్ 4 వికెట్లు
భారత్ రెండో ఇన్నింగ్స్: 36/9 ; మయాంక్ 9, విహారి 8 పరుగులు; హాజిల్‌వుడ్ 5 వికెట్లు
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 93/2; జో బర్న్స్ 51*, మాథ్యూవేడ్ 33; అశ్విన్ 1 వికెట్