ఆస్ట్రేలియాదే మహిళల వరల్డ్ కప్.. విశ్వవిజేతగా ఏడోసారి..
Women Cricket World Cup: మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది.
Women Cricket World Cup: మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. క్రైస్ట్ చర్చ్ లో జరిగిన ఫైనల్ పోరులో ఇంగ్లండ్ ను 71 పరుగుల తేడాతో కంగారులు చిత్తు చేశారు. వన్డే వరల్డ్ కప్ ఏడో టైటిల్ ను చేజిక్కించుకుని తనకు ఎదురులేదని ఆసీస్ నిరూపించుకుంది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 357 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. ఓపెనర్లు అలీసా హీలీ, రాచెల్ హేయెన్స్ లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ముఖ్యంగా అలెక్స్ హీలీ రికార్డ్ ఇన్నింగ్స్ ఆడింది. 138 బంతుల్లో 26 ఫోర్లతో 170 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 285 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాటర్ నటాలీ షివర్ దూకుడుగా ఆడినా ఫలితం లేకుండా పోయింది. నటాలీ కేవలం 121 బంతుల్లో 148 పరుగులు చేసినా మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తోపాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా అలీసా సొంతం చేసుకుంది.