Team India Coach: టీమిండియా కోచ్ పదవిని తిరస్కరించిన అనిల్ కుంబ్లే
* భారత కోచ్ పదవిపై ఆసక్తి లేదు: అనిల్ కుంబ్లే
Team India Coach: ఒక వైపు ఐపీఎల్, త్వరలోనే టీ20 ప్రపంచకప్, ఈ మధ్యే ప్రపంచకప్ ముగిసిన తరువాత కెప్టెన్ గా బాధ్యతల నుండి తప్పుకుంటానని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రకటన చేయడంతో అటు కెప్టెన్ ఎంపికలో బిజీబిజీగా ఉన్న బిసిసిఐకి మరో సమస్య వచ్చిపడింది.
టీ20 ప్రపంచకప్ తరువాత హెడ్ కోచ్ గా రవిశాస్త్రి కోచ్ పదవి ముగియడంతో బాధ్యతల నుండి తప్పుకుంటున్న సంగతి తెలిసిందే.
అయితే నిన్న మొన్నటి వరకు భారత మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లేని నియమించాలని ప్రయత్నాలు చేసిన వారి ఆఫర్ ని కుంబ్లే సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అయితే కోచ్ రేసులో వివిఎస్ లక్ష్మన్ కూడా ఉండటం.. అతనిపై బిసిసిఐ అంతగా ఆసక్తి చూపించకపోవడంతో హెడ్ కోచ్ గా విదేశీ ఆటగాడిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
గతంలో టీమిండియాకి కోచ్ గా బాధ్యతలు చేపట్టి ప్రపంచకప్ ని అందించిన గ్యారీ క్రిస్టెన్ ని సంప్రదించాలా లేదా ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్, ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టు కోచ్ రికి పాంటింగ్, శ్రీలంక మాజీ ఆటగాడు జయవర్దేనని వంటి ఆటగాళ్ళను ఎంపిక చేయాలో అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
రవిశాస్త్రి ఇప్పటికే తన కోచ్ పదవి పొడగింపుపై ఆసక్తి లేదని చెప్పడంతో బిసిసిఐ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ మాత్రం అనిల్ కుంబ్లేని నియమించాలనే ప్రయత్నాలు చేస్తుండటం..దానికి కుంబ్లే తాను 2017 లో కోచ్ పదవి వదులుకున్న సందర్భంలో ఉన్న పరిస్థితులే ఇప్పుడు కూడా ఉన్నాయని అందువల్లే తనకి కోచ్ పదవిపై ఇష్టంకూడా లేదని కచ్చితంగానే చెప్పినట్లు సమాచారం.