Neeraj Chopra-Anand Mahindra: టోక్యో ఒలింపిక్స్ లో 100 ఏళ్ళ కళను నెరవేరుస్తూ భారత్ కు అథ్లెటిక్స్ లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది.ఇప్పటికే హర్యానా ప్రభుత్వం 6 కోట్ల రూపాయలతో పాటు గ్రేడ్ 1 ఉద్యోగాన్ని నీరజ్ చోప్రాకి ఇవ్వబోతున్నట్లు ప్రకటన చేసింది. జావెలిన్ త్రో ఫైనల్స్‌లో తొలి ప్రయత్నంలోనే 87.03 మీటర్లుతో పాటు నీరజ్ రెండో రౌండ్‌లోనూ 87.58 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలిచి టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కి మొదటి పసిడి పతకాన్ని తెచ్చిపెట్టాడు. ఇక తాజాగా ట్విట్టర్ వేదికగా మహేంద్ర కంపెనీ అధినేత ఆనంద్ మహేంద్ర బంగారు పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రాని "బాహుబలి" అని ప్రశంసిస్తూ మేము అంత నీ ఆర్మీ అంటూ నీరజ్ చోప్రా జావెలిన్ పట్టుకున్న ఫోటో మరియు బాహుబలిలో ప్రభాస్ గుర్రంపై ఉన్న ఫోటోని షేర్ చేశాడు.
ఇక రితేష్ జైన్ అనే ట్విట్టర్ యూజర్ నీరజ్ చోప్రాకి త్వరలో లాంచ్ చేయబోతున్న మహేంద్ర xuv700 ను బహుమతిగా ఇవ్వాలని ఆనంద్ మహేంద్రని కోరగా ఆ ట్వీట్ కి స్పందించిన ఆనంద్ మహేంద్ర తప్పకుండా బాహుబలి నీరజ్ చోప్రాకి మహేంద్ర xuv700 ని బహుమతిగా ఇవ్వడం తనకు వ్యక్తిగతంగా ప్రత్యేకమే కాకుండా గౌరవం అంటూ రీట్వీట్ చేశాడు. ఇక గతంలో పీవి సింధు వెండి పతకం గెలిచిన సందర్భంగా మహేంద్ర థార్ కారును ఆనంద్ మహేంద్ర బహుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.