IPL 2022: అహ్మదాబాద్ జట్టులో ఆ ముగ్గురు.. కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్..!!
* రబాడ, హర్షల్ పటేల్ కి భారీ ఆఫర్ ఇచ్చిన అహ్మదాబాద్ జట్టు యాజమాన్యం
IPL 2022 - Shreyas Iyer: ఇప్పటికే ఐపీఎల్ 2022 కోసం రిటైన్ ప్రక్రియ ముగియగా కొత్తగా వచ్చిన లక్నో, అహ్మదాబాద్ జట్లు రిటైన్ ప్రక్రియ ముగియక ముందే నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది ఆటగాళ్ళతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు మిగిలిన జట్టు యాజమాన్యాలు ఇప్పటికే బిసీసీఐకి ఫిర్యాదు చేశాయి. ఇటీవల లక్నో జట్టు యాజమాన్యం కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్ లను జట్టులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో అహ్మదాబాద్ జట్టు కూడా అదేదారిలో వెళ్తున్నట్లు తెలుస్తుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాడైన శ్రేయాస్ అయ్యర్ తో పాటు కగిసో రబాడలను జట్టులోకి తీసుకోడానికి భారీగా ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఢిల్లీ కెప్టెన్ గా శ్రేయాస్ ని తొలగించి రిషబ్ పంత్ కి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడంతో జట్టు నుండి బయటికి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కి అహ్మదాబాద్ జట్టు యాజమాన్యం కెప్టెన్ గా బాధ్యతలు అప్పజెప్పడంతో పాటు 15 కోట్లు ఆఫర్ చేసినట్టు సమాచారం. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ రబాడకి 10 కోట్లు ఇవ్వడానికి ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది.
అంతేకాకుండా ఐపీఎల్ 2021 లో అత్యధిక వికెట్లు సాధించిన హర్షల్ పటేల్ కి 5-7 కోట్ల రూపాయలు కూడా ఆఫర్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ హర్షల్ పటేల్ అహ్మదాబాద్ జట్టు ఇచ్చిన ఆఫర్ ని తిరస్కరిస్తే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడైన శిఖర్ ధావన్ కోసం ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.