Team India: రోహిత్ వారుసుడు ఎవరు.. టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎవరు? ఆ ఇద్దరు పర్ఫెక్ట్ అంటోన్న మాజీ సెలెక్టర్

Team India: రోహిత్ వారుసుడు ఎవరు.. టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎవరు? ఆ ఇద్దరు పర్ఫెక్ట్ అంటోన్న మాజీ సెలెక్టర్

Update: 2024-07-16 13:30 GMT

Team India: రోహిత్ వారుసుడు ఎవరు.. టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎవరు? ఆ ఇద్దరు పర్ఫెక్ట్ అంటోన్న మాజీ సెలెక్టర్

Team India: ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు టీమిండియాను రోహిత్ తీసుకెళ్లాడు. ఇప్పుడు రోహిత్ శర్మ తర్వాత టీ20 జట్టుకు ఎవరు కెప్టెన్సీ వహిస్తారనేది ప్రశ్నగా మారింది. ఇందుకోసం మాజీ క్రికెటర్, సెలెక్టర్ సబా కరీమ్ ఇద్దరి పేర్లను సూచించారు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌లు జట్టుకు సారథ్యం వహించేందుకు మంచి ఎంపిక అని సబా చెప్పుకొచ్చాడు.

సబా కరీమ్ మాట్లాడుతూ, “మొదట టీ20 అంతర్జాతీయ జట్టుకు ఎవరు కెప్టెన్సీ వహిస్తారో చూడాలి. రోహిత్ శర్మ ఇప్పుడు రిటైరయ్యాడు. అతను ఇకపై టీ20 ఇంటర్నేషనల్ ఆడడు. రోహిత్ తర్వాత భారత్‌కు రెండు ఆప్షన్లు ఉన్నాయని నా అభిప్రాయం. చూస్తుంటే హార్దిక్ పాండ్యాని కెప్టెన్‌గా చేయొచ్చు. ఎందుకంటే ప్రపంచకప్ సమయంలో టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. ఇంతకుముందు కూడా అతను టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. రెండేళ్ల తర్వాత మరో టీ20 ప్రపంచకప్‌కు సన్నాహాలు ప్రారంభించాలని భావిస్తున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు.

సబా కరీం ఇంకా మాట్లాడుతూ, “రెండో పేరు సూర్యకుమార్ యాదవ్ కావచ్చు. ఎందుకంటే అతను ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో భారత్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. అక్కడ ఆస్ట్రేలియాను భారత్ ఓడించింది. సూర్య కూడా బాగా బ్యాటింగ్ చేశాడు. అందువల్ల సూర్య మరొక ఎంపికగా ఉండవచ్చని నేను భావిస్తున్నాను' అంటూ తెలిపాడు.

హార్దిక్ పాండ్యా ఇప్పటివరకు 16 టీ20 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. ఈ సమయంలో అతను 10 మ్యాచ్‌లు గెలిచాడు. ఒక మ్యాచ్ టై అయింది. అదే సమయంలో, సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 7 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సమయంలో అతను 5 మ్యాచ్‌లు గెలిచాడు. రెండు పరాజయాలను ఎదుర్కొన్నాడు. గణాంకాల ప్రకారం, ఈ ఇద్దరు కెప్టెన్లు టీమ్ ఇండియా భవిష్యత్తుకు పర్ఫెక్ట్ అని అంతా భావిస్తున్నారు.

Tags:    

Similar News