ఆస్ట్రేలియా టూర్‌పై కరోనా ఎఫెక్ట్.. మొదటి టెస్ట్ జరిగేనా?
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఇంకా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా సౌత్ ఆస్ట్రేలియా రాష్ట్రంలో మాత్రం వీపరితంగా కేసులు పెరుగుతున్నాయి. స్థానికంగా అక్కడ ఉండే ఓ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఇంకా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా సౌత్ ఆస్ట్రేలియా రాష్ట్రంలో మాత్రం వీపరితంగా కేసులు పెరుగుతున్నాయి. స్థానికంగా అక్కడ ఉండే ఓ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. దీనితో అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తూ స్కూళ్లు, షాపులు మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ ఇప్పుడు ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ ల పైన పడే ఛాన్స్ ఉంది. 3 వన్డేలు, 3 టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం టీమిండియా జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్న సంగతి తెలిసిందే.
ఇక రేపు ఆస్ట్రేలియా క్రికెటర్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అటు తాను ఇప్పటికే స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు ఆసీస్ కెప్టెన్ టిమ్ పెయిన్ ప్రకటించాడు. ఈ క్రమంలో ఆసీస్ తో మ్యాచ్ లు జరగడం అనేది అనుమానంగా మారింది. అయితే అడిలైడ్ టెస్టు యథాతథంగా జరుగుతుందని ఆసీస్ బోర్డు అంటుంది. పూర్తి నిబంధనలు పాటిస్తూ మ్యాచ్‌ను నిర్వహిస్తామని వెల్లడించింది. వచ్చే నెల 17 నుంచి అడిలైడ్ ఓవల్ మైదానంలో ఇరు జట్ల మధ్య తొలిసారిగా డే-నైట్ టెస్టు జరుగనుంది.
ఇక ఈ మ్యాచ్ ని వీక్షించేందుకు స్టేడియం సామర్థ్యంలో 50 శాతం మందికి అవకాశమిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనని విడుదల చేసింది. అయితే ఆ ప్రకటనను వెనక్కి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.