IPL 2022: డివిలియర్స్ ను వదులుకోం..!!
IPL 2022: ఐపీఎల్ మొదలైందంటే భారత క్రీడాభిమానులకు దాదాపుగా రెండు నెలల పాటు పండుగే అని చెప్పాలి తమ అభిమాన టీమ్స్
IPL 2022: ఐపీఎల్ మొదలైందంటే భారత క్రీడాభిమానులకు దాదాపుగా రెండు నెలల పాటు పండుగే అని చెప్పాలి తమ అభిమాన టీమ్స్ కి సపోర్ట్ చేస్తూ బోలెడంత సంతోషంతో గెలుపును, కాస్త బాధతో ఓటమిని ఆస్వాదిస్తారు. ఇటీవల కరోన మహమ్మారితో అర్ధాంతరంగా ముగిసిన ఐపీఎల్ త్వరలో అరబ్ దేశాల్లో నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ విదేశ ఆటగాళ్ళతో మైదానంలో పోటీపడే పలు టీమ్స్ లో కొన్ని ఏళ్లుగా ఆడుతున్న ఆటగాళ్ళకి ఐపీఎల్ 2022 లో ప్రస్తుతం ఉన్న 8 జట్లకు మరో రెండు టీమ్స్ కలుస్తుండటంతో కాసింత టెన్షన్ మొదలైంది. ముందు నుండి ఉన్న టీంని వదిలి ఏ టీంలోకి వెళ్తామో అక్కడి పరిస్థుతులు ఎలా ఉంటాయోనని బెంగ మొదలైంది. ఇప్పటికే నలుగురు ప్లేయర్స్ ని మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం బీసీసీఐ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇటీవలే ముంబై టీం నుండి రోహిత్, పోలార్డ్, హార్దిక్, బుమ్రా వంటి ప్లేయర్స్ ని వదులుకోలేమని ఆ నలుగురు ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోబోతున్న ముంబై తర్వాత తాజాగా ఐపీఎల్ లో ఉన్న టీమ్స్ లో అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న బెంగుళూరు టీం తరపున గత 10 ఏళ్ళుగా ఆడుతున్న మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ను బెంగుళూరు రిటైన్ చేసుకోనుంది. ఈ జట్టు నుండి కెప్టెన్ విరాట్ కోహ్లి, డివిలియర్స్, దేవ్ దత్త్ పడిక్కల్ తో పాటు ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్ వెల్ ను బెంగుళూరు టీం మేనేజ్మెంట్ రిటైన్ చేసుకొని ఆ జట్టు తరపున కొనసాగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుండి విరామం తీసుకున్న ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ లో మొదటి మూడు సీజన్లో ఢిల్లీ క్యాపిటల్ టీంలో కెప్టెన్ గా ఉన్న తర్వాత బెంగుళూరు జట్టు తరపున ఆడుతున్న డివిలియర్స్ జట్టుతో సంబంధం లేకుండా తన ఆటతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.