AB de Villiers: ఇక సెలవు.. ఐపీఎల్ కి గుడ్ బై చెప్పే ఆలోచనలో డివిలియర్స్..!?
* ఈ 37 ఏళ్ళ వయస్సులో ఇక అన్ని క్రికెట్ ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం
AB de Villiers: దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబి డివిలియర్స్.. ఈ పేరు వింటే ప్రత్యర్ధి జట్టు బౌలర్స్ కి హడల్.. తన అసాధారణ బ్యాటింగ్ తో గ్రౌండ్ లో బంతిని నలుమూలలా బౌండరీకి తరలించే ఈ ఆటగాడిని మిస్టర్ 360 అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. ఐపీఎల్ లో గత కొన్ని సీజన్ల నుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు తరపున ఆడుతున్న డివిలియర్స్ ఈ ఏడాది ఐపీఎల్ లో మొదటి ఫేజ్ లో ఫర్వాలేదనిపించిన.. యూఏఈలో జరిగిన రెండో దశ ఐపీఎల్ లో మాత్రం తన ఆటతో అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయాడు.
ఐపీఎల్ 2021లో ఆడిన 15 మ్యాచ్ లలో కేవలం 2 అర్ధ సెంచరీలతో 313 పరుగులను సాధించిన ఏబిడి యూఏఈలో జరిగిన 8 మ్యాచ్ లలో 0,12,11,4,23,19,26,11 పరుగులతో విఫలమయ్యాడు. ఇప్పటికే దక్షిణాఫ్రికా క్రికెట్ కి గుడ్ బై చెప్పిన ఈ ఆటగాడు త్వరలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ లో పాల్గోనబోతున్నాడని వార్తలు వినిపించిన వాటిని ఏబిడి ఖండించాడు. తాజాగా తన ఫామ్ తో పాటు వయస్సు రీత్యా రానున్న ఐపీఎల్ కి కూడా గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అదే జరిగితే బెంగుళూరు జట్టు నుండి విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, మాక్స్ వెల్ తో పాటు సిరాజ్ లేదా చాహల్ ని రిటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోమవారం మ్యాచ్ ముగిసిన తరువాత విరాట్ కోహ్లితో పాటు గ్రౌండ్ లోనే డివిలియర్స్ కంటతడి పెట్టుకున్నాడు. ఈ ఏడాది బెంగుళూరు జట్టుకి టైటిల్ అందించి ఐపీఎల్ నుండి తప్పుకుందామనుకున్నా ఓటమితో నిరాశే మిగిలింది. ఇక బెంగుళూరు జట్టు బ్యాటింగ్ కి వెన్నెముకల ఇన్నాళ్ళు నిలబడ్డ ఏబి డివిలియర్స్ ఐపీఎల్ నుండి తప్పుకుంటే మాత్రం అటు బెంగుళూరు అభిమానులే కాకుండా క్రికెట్ అభిమానులకు ఇది చేదువార్తే.