AB de Villiers: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు షాక్‌.. అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన ఏబీ డివిలియ‌ర్స్‌

AB de Villiers: దక్షిణాఫ్రికా క్రికెట్‌లో మిస్టర్ 360గా పేరున్న ఏబీ డివిలియర్స్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు.

Update: 2021-11-19 10:23 GMT

AB de Villiers: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు షాక్‌.. అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన ఏబీ డివిలియ‌ర్స్‌

AB de Villiers: దక్షిణాఫ్రికా క్రికెట్‌లో మిస్టర్ 360గా పేరున్న ఏబీ డివిలియర్స్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గతంలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఏబీ తాజా నిర్ణయంతో ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నట్టయింది. ఇంగ్లీష్, ఆఫ్రికాన్స్, హిందీ భాషల్లో కృతజ్ఞతలు చెప్పిన డివిలియర్స్ తనను సగం భారతీయుడిగా పేర్కొంటూ ట్వీట్ చేశాడు.

2004లో ఏబీ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ద‌క్షిణాఫ్రికాకు అత‌ను 114 టెస్టులు, 228 వ‌న్డేలు, 78 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి అత‌ను 20014 ర‌న్స్ చేశాడు. టెస్టులు, వ‌న్డేల్లో అత‌ని స‌గ‌టు 50 క‌న్నా ఎక్కువే ఉంది. వాస్త‌వానికి అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి అత‌ను 2018 మేలోనే త‌ప్పుకున్నాడు. ప్ర‌స్తుతం ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో ఆర్‌సీబీకి ఆడుతున్నాడు. తాజా రిటైర్మెంట్‌తో ఏబీ ఇక ఆర్సీబీకి కూడా దూరంకానున్నాడు. 

Tags:    

Similar News