3rd ODI: ఆఖరి పోరాటంలో గెలిచేదెవరో..

3rd ODI: నేడు (ఆదివారం) పుణె లో ఇండియా, ఇంగ్లాండ్ ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది.

Update: 2021-03-28 05:15 GMT

ఫైనల్ మ్యాచ్ కు సిద్ధమైన ఇండియా, ఇంగ్లాండ్ టీంలు

3rd ODI: నేడు (ఆదివారం) మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇండియా, ఇంగ్లాండ్ ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో విజేత ఎవరో తెలిసిపోనుంది. మధ్యాహ్నం ప్రారంభమయ్యే మ్యాచ్ లో టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకునే అవకాశాలున్నాయి. ఇరు జట్లకు కీలకంగా మారిన ఈ మ్యాచ్ లో అన్ని అస్త్రాలతో బరిలోకి దిగనున్నాయి రెండు టీంలు.

భారత్ తొలి మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో గెలిచింది. ఇక శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచి, తిరిగి సిరీస్‌లో నిలబడింది. 337 పరుగుల లక్ష్యాన్ని కేవలం 44 ఓవర్లోనే ఛేదించి ఫామ్ లోకి వచ్చారు.

భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, క్రునాల్ పాండ్యాలు తమ 16 ఓవర్లలో 156 పరుగులు ఇచ్చి, నిరాశకు గురి చేశారు. వీరితో పోల్చితే... ఇంగ్లాండ్ స్పిన్నర్లు మెయిన్ అలీ, ఆదిల్ రషీద్ చాలా మెరుగ్గా బౌలింగ్ చేశారు. విరాట్ కోహ్లీ కూడా భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో బౌలర్లు విఫలమయ్యారని పేర్కొన్నాడు. అయితే, ఈ మ్యాచ్ లో చైనామన్ కుల్దీప్ యాదవ్ కు విశ్రాంతి ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అతని స్థానంలో యుజ్వేంద్ర చాహల్ ను తీసుకుంటారని సమాచారం. ఇక పేసర్లు కూడా అంతగా రాణించలేకపోయారు. ఒక్క భువనేశ్వర్ మినహా ఎవ్వరూ కొత్త బంతితో ఆకట్టుకోలేక పోయారు.

తొలి వికెట్ తీసేందుకు చాలా కష్టపడ్డారు టీమిండియా బౌలర్లు. కాగా, ఈ మ్యాచ్ లో తొలి వికెట్లు కచ్చితంగా తీయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇంగ్లాండ్ ఓపెనర్లు జాన్సన్, రాయ్ లు మరో సారి భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు నూతన పేస్ బౌలర్ ఎం. ప్రసిద్ కృష్ణ ఇదే విషయాన్ని అంగీకరించాడు. ఈమేరకు "వ్యక్తిగతంగా నేను ఓపెనింగ్ బౌలింగ్ ను ఘనంగా ప్రారంభించాలనుకుంటున్నాను. నేను కొత్త బంతితో బౌలింగ్ చేయడాన్ని మరింతగా మెరుగుపరచాలనుకుంటున్నాను" అని వెల్లడించాడు.

ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనస్ చాలా ప్రమాదకరంగా మారింది. వారిని తర్వగా పెవిలియన్ కు పంపకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రెండో వన్డేలో అర్థమైంది. అలాగే 3 వ స్థానంలో బ్యాటింగ్ చేసిన, బెన్ స్టోక్స్ కేవలం 52 బంతుల్లో 99 పరుగులు చేసి భారత్‌కు విజయాన్ని దూరం చేశాడు.

ఇక టీమిండియా బ్యాటింగ్ లో కె.ఎల్. రాహుల్, రిషబ్ పంత్ (40 బంతుల్లో 77 పరుగులు) రాణించారు. భారత ఓపెనర్లు రోహిత్, ధావన్ మాత్రం ఇంకా లయను అందిపుచ్చుకోలేక పోతున్నారు. వీరి నుంచి భారీ భాగస్వామ్యాలు టీమిండియాకు అవసరం. కెప్టెన్ కోహ్లీ కూడా బాగానే రాణిస్తున్నాడు. కానీ, కేవలం అర్థశతకాలతోనే సరిపెట్టుకుంటున్నాడు. వాటిని సెంచరీలుగా మార్చడంలో మాత్రం విఫలమవుతున్నాడు.

పిచ్: ఈసారి కూడా పిచ్ భారీ స్కోర్లు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది.

టీంల అంచనా:

ఇండియా ఎలెవన్ : శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా / వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకూర్ / టీ నటరాజన్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్/ చాహల్

ఇంగ్లాండ్ ఎలెవన్: జానీ బెయిర్‌స్టో, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, డేవిడ్ మలన్, జోస్ బట్లర్ (కెప్టెన్/ కీపర్), లియామ్ లివింగ్స్టోన్, మొయిన్ అలీ, సామ్ కుర్రాన్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్

Tags:    

Similar News