ICC WTC Finals: భారీ టీంనే సెలక్ట్ చేస్తున్నారు?

ICC WTC Finals: ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Update: 2021-05-06 17:05 GMT

ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (ఫొటో ట్విట్టర్)

ICC WTC Finals: ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం అందరి చూపు జూన్ లో జరగనున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ పై పడిందనడంలో సందేహం లేదు. అయితే ఇందుకోసం జట్టును ఎంపిక చేసే పనిలో నిమగ్నమైందట బీసీసీఐ. ఈ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ప్రాబబుల్స్‌ను భారీగానే సెలక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. చేతన్‌శర్మ నేతృత్వంలోని కమిటీ 22 నుంచి 24 మందితో టీమ్‌ఇండియాను ప్రకటించనుందని తెలుస్తోంది. వచ్చే వారం చివర్లో ఫైనల్ టీంపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం భారత్‌ నుంచి విమాన ప్రయాణాలపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఓ స్పెషల్ విమానంలో టీం ఇండియాను ఇంగ్లాండ్‌కు పంపించనుంది బీసీసీఐ. బ్రిటన్‌లో పది రోజులు క్వారంటైన్‌ లో ఉంటారు. ఆ తరువాత జూన్‌ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ ఆడనున్నారు. అనంతరం ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడుతుంది టీం ఇండియా.

మరోవైపు జూన్‌ 2న ఆరంభమయ్యే ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ టీం 20 మందితో కూడిన జట్టును ఇప్పటికే ప్రకటించింది. ఆ తర్వాత టీమ్ఇండియాతో వరల్డ్ టెస్ట్ సిరీస్‌ ఫైనల్‌ కోసం 15 మందితో జట్టును ఎంపిక చేయనున్నారు.

Tags:    

Similar News