3rd Test Match: అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో తొలి మ్యాచ్‌

3rd Test Match: మహా మైదానంలో మెగా సమరం * మొతేరాలో పింక్‌ బౌల్‌ పోరు

Update: 2021-02-24 03:45 GMT

ఫైల్ ఇమేజ్ 

India: ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంలో మ్యాచ్‌. పైగా అది డేనైట్‌లో. పింక్‌ బౌల్‌తో జరిగే టెస్టు సమరంలో తలపడేది భారత్‌, ఇంగ్లండ్‌. ఇరు జట్లు మధ‌్య సిరీస్‌ 1-1తో సమంకాగా.. ఇప్పుడు ఆధిక్యం సాధించేదెవరనే ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అంతేకాదు ఈ మ్యాచ్‌ ఫలితం మీదే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో పోటీ పడే రెండో జట్టేదో దాదాపు తేలిపోతుంది. ఈరోజు మధ్యాహ్నం మొతేరా మైదానంలో ఆరంభమయ్యే భారత్‌-ఇంగ్లాండ్‌ మూడో టెస్టును క్రికెట్‌ ప్రపంచమంతా ఆసక్తిగా చూడటానికి రెడీ అయ్యింది.

లక్షా పది వేల సామర్థ్యంతో ప్రపంచలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంగా రూపుదిద్దుకున్న మొతేరా మైదానంలో తొలి మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. చెప్పాలంటే తొలి టెస్టులో చిత్తయ్యాక.. రెండో టెస్టులో బలంగా పుంజుకుని ప్రత్యర్థిని దెబ్బ తీయడం భారత్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అయితే రెండో టెస్టులో చిత్తుగా ఓడినప్పటికీ ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇక ఇషాంత్‌ శర్మ తన వందో టెస్టును చిరస్మరణీయం చేసుకోవాలని టీమిండియా జట్టు కోరుకుంటోంది.

Full View


Tags:    

Similar News