కొబ్బరి కాయను ఎందుకు కొడతారో తెలుసా..?

ఎవరైనా సరే గుడికి వెళ్తే దేవుడిని ప్రార్థించి కొబ్బరికాయలు కొట్టడం ఆనవాయితి. అంతే కాదు ఏదైనా శుభకార్యం చెయ్యాలన్న, పండగలు వచ్చినా, ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతారు. హిందూ సాంప్రదాయ ప్రకారం కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఇస్తారు.

Update: 2020-03-01 05:26 GMT

ఎవరైనా సరే గుడికి వెళ్తే దేవుడిని ప్రార్థించి కొబ్బరికాయలు కొట్టడం ఆనవాయితి. అంతే కాదు ఏదైనా శుభకార్యం చెయ్యాలన్న, పండగలు వచ్చినా, ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతారు. హిందూ సాంప్రదాయ ప్రకారం కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అయితే అసలు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, దాని వెనక ఉన్న ఆంతర్యం ఎంటి. చాలామందికి తెలీదు. ఇప్పుడు ఆ విషయాలను తెలుసు కుందాం. పురాణాల ప్రకారం కొబ్బరి కాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

నిజానికి కొబ్బరి కాయను మనిషి తలతో పోలుస్తారు. కొబ్బరి కాయ మీద పీచును మనిషి జుట్టుతో పోలుస్తారు. అంతే కాదు గుండ్రని కొబ్బరి వుండే ఆకారం మనిషి ముఖం, కొబ్బరికాయలో ఉండే నీటిని రక్తంతో పోలుస్తారు. ఇక కొబ్బరిని కొట్టిన తరువాత అందులో వుండే లేత కొబ్బరిని మనస్సుగా భావిస్తారు. అయితే కొబ్బరిని దేవునికి కొట్టినప్పుడు మనసులో వున్న కల్మషం, అహంకారం అన్ని తొలగుతాయి అంటారు.

అందుకే కొబ్బరి కాయను ఆలయంలో కొడతారు. ఇకపోతే కాయను కొట్టినప్పుడు కొంతమందికి పువ్వు వొస్తుంది. కొంతమంది కొట్టినప్పుడు లోపల పెరుగుగా కనిపిస్తుంది. అయితే దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్లిపోతే మంచిదా లేక అపచారమా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. కొంత మంది కాయ కుల్లితే కీడు సంభవిస్తుందని, చెడు జరుగుతుందని ఆందోళనకు చెందుతారు. అంతే కాదు కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తియ్యగా ఉన్నా, అందులో పువ్వు వచ్చినా చాలా సంతోష పడతారు.

కొత్తగా పెళ్ళైన వారు టెంకాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతానప్రాప్తి లభిస్తుంది. కాయ కొట్టినప్పుడు అది పగిలే విధానం కూడా కొంతమందిని తృప్తి పరుస్తుంది. మరి కొంతమందిని అసంతృప్తి పరుస్తుంది. కాయ సమానంగా పగిలితే మనస్సులోని కోరిక నెరవేరుతుందని భావిస్తారు. నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురుకి గానీ, కొడుకుకి గానీ సంతానం లభిస్తుందని భావిస్తారు. అయితే, ఇంట్లోగానీ, ఆలయంలోగానీ కొట్టిన టెంకాయ కుళ్ళిపోతే దానిని పారవేసి, చేతులు కాళ్లు కడుక్కుని మళ్లీ పూజ చేస్తే సరిపోతుందని అర్చకులు చెప్తారు.

Tags:    

Similar News