Vastu Tips: తక్కువ సమయంలో ధనవంతులు అయిపోతారు.. ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే సరి..!

Vastu Tips: జీవితంలో ప్రతి వ్యక్తి తనకు చాలా సంపద ఉండాలని కోరుకుంటాడు.

Update: 2022-11-10 09:33 GMT

Vastu Tips: తక్కువ సమయంలో ధనవంతులు అయిపోతారు.. ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే సరి..!

Vastu Tips: జీవితంలో ప్రతి వ్యక్తి తనకు చాలా సంపద ఉండాలని కోరుకుంటాడు. అంతేకాదు ఇంట్లో దేనికి లోటు ఉండకూడదని, సమాజంలో ఎంతో గౌరవ మర్యాదలు ఉండాలని ఆరాటపడుతాడు. కానీ ఈ కోరికలన్నీ అందరికీ నెరవేరవు. మీరు ఇవన్నీ పొందాలని అనుకుంటే వెంటనే లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించండి. వాస్తు శాస్త్రం ప్రకారం తల్లి లక్ష్మి కొన్ని ప్రత్యేక పనులతో సంతోషిస్తుంది. వారికి ఆశీర్వాదాలని అందజేస్తుంది. ఆ వాస్తు చిట్కాల గురించి తెలుసుకుందాం.

1. తులసి మొక్కపై నెయ్యి దీపం

మీ ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉండాలి. లక్ష్మీ మాతా తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే తల్లి లక్ష్మి సంతోషిస్తుంది. కుటుంబంలోని అన్ని కోరికలను నెరవేరుస్తుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది.

2. తూర్పు దిశగా భోజనం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆహారం తీసుకునేటప్పుడు ముఖం తూర్పు దిశలో ఉండేలా చూసుకోండి. ఈ దిశ సూర్య భగవానుడికి అంకితం చేశారు. శుభప్రదంగా చెబుతారు. భోజనం చేసేటప్పుడు కాళ్లకు చెప్పులు వేసుకోవద్దు. తల్లి అన్నపూర్ణకు కోపం వస్తుంది.

3. ఈశాన్యంలో గంగాజలం చల్లండి

ఇంటి ఈశాన్య కోణం అత్యంత శుభప్రదమైనదిగా చెబుతారు. ప్రతికూల శక్తులు ఈ భాగంలో ఉండటానికి ప్రయత్నిస్తాయి. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి దుష్ట శక్తులు ఇంటి నుంచి దూరంగా ఉండాలంటే క్రమం తప్పకుండా ఈశాన్యంలో గంగాజలాన్ని చల్లుకోవాలి.

4. నిద్రలేవగానే అరచేతిని చూడండి

మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలనుకుంటే ఉదయాన్నే నిద్ర లేవగానే అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి. లక్ష్మీ మంత్రం జపించండి.

Tags:    

Similar News