Gold Rates: బంగారం ధర కేరళలో ఎందుకు తక్కువ?

Gold Rates: బంగారం ధరలు నిజానికి అంతర్జాతీయ మార్కెట్ రేట్ల మీద ఆధారపడి ఉంటాయి.

Update: 2024-06-13 12:57 GMT

Gold Rates: బంగారం ధర కేరళలో ఎందుకు తక్కువ?

Gold Rates: బంగారం ధరలు నిజానికి అంతర్జాతీయ మార్కెట్ రేట్ల మీద ఆధారపడి ఉంటాయి. అంటే, బంగారం ధర ఎక్కడైనా ఒకేలా ఉండాలి. ఇది లాజిక్. కానీ, దీనికి భిన్నంగా దేశంలోని ఒక్కో రాష్ట్రంలో బంగారం రేటు ఒక్కో విధంగా ఉంటుంది. ముఖ్యంగా, కేరళలో మిగతా రాష్ట్రాలతో పోల్చితే గోల్డ్ రేటు తక్కువగా ఉంటుంది. దీనికి అక్కడి లోకల్ రీజన్స్ ఉన్నాయి.

బంగారం ధరలు ఎందుకు మారుతాయి?

బంగారం ధరలను చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. దిగుమతి సుంకం, రవాణ ఖర్చులు, నాణ్యత, స్థానికంగా ఉన్న డిమాండ్, సప్లయ్ వంటి అంశాలు బంగారం ధరలను నిర్ణయిస్తాయి. వీటి ఆధారంగానే రాష్ట్రాల మధ్య పసిడి ధరలో తేడా కనిపిస్తుంది. రాష్ట్రాలలో గోల్డ్ రేట్స్ మీద ప్రభావం చూపించే అంశాలేంటో ఇప్పుడు చూద్దాం.

బంగారం ధరలపై రవాణా ఖర్చుల ప్రభావం..

బంగారం ధరల్లో తేడాలకు రవాణ ఖర్చులు ఒక ముఖ్య కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం అత్యంత విలువైంది. ఒక్క ప్రాంతం నుండి మరో ప్రాంతానికి బంగారాన్ని తీసుకెళ్లడానికి కట్టుదిట్టమైన భద్రత అవసరం. ఒక చోటు నుండి మరో చోటుకు బంగారాన్ని తరలించేందుకు చేసే ఖర్చు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తుంది.

డిమాండ్ – సప్లయి ఫార్ములా

డిమాండ్ ఎక్కువగా ఉండి సరఫరా తక్కువగా ఉన్న రాష్ట్రంలో బంగారం ధర ఎక్కువగా ఉంటుంది. సరఫరా డిమాండ్ కన్నా ఎక్కువగా ఉంటే ధరలు తగ్గుతాయి. దీంతో పాటు, రిటైల్ మార్కెట్లో పోటీ వల్ల కూడా బంగారం ధరలో కొద్ది పాటు తేడాలు వస్తుంటాయి. కొనుగోళ్ళు అధికంగా ఉన్న ప్రాంతాల్లో రీటైల్ వ్యాపారులు మార్జిన్ తగ్గించుకోవడం వల్ల గోల్డ్ రేట్ కొంత తగ్గుతుంది.

బంగారంపై ప్రభుత్వ పన్నుల ప్రభావం

గతంలో బంగారంపై ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా వ్యాట్ విధించేవారు. మోదీ సర్కార్ జీఎస్టీని అమల్లోకి తెచ్చిన తర్వాత బంగారంపై పన్ను మూడు శాతం విధించారు. దీనివల్ల బంగార ధరల్లో రాష్ట్రాల మధ్య తేడాలు బాగా తగ్గిపోయాయి.

కేరళలో ఎందుకు తక్కువ అంటే...

కేరళలో బంగారం లావాదేవీలు చాలా వరకు స్థిరంగా కొనసాగుతుంటాయి. ఇక్కడ ద్రవ్యోల్బణం కూడా తక్కువ. దీనికి తోడు ఇక్కడ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం వల్ల కూడా ప్రజలు బంగారం మీద ఎక్కువ పెట్టుబడి పెడుతుంటారు.

బంగారం దిగుమతులు కరెన్సీ విలువల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. కేరళలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అధికంగా ఉండడం వల్ల ఇక్కడ రూపాయ ధర చాలా వరకు స్థిరంగా ఉంటుంది. ఇక్కడ బంగారం ధర తక్కువగా ఉండడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం.

కేరళ ప్రజలు సింపుల డిజైన్స్ ఇష్టపడడం వల్ల మేకింగ్ చార్జెస్ తక్కువ ఉంటాయి. దీనివల్ల బంగారు ఆభరణాల ఖరీదు కూడా ఇక్కడ తక్కువే.

బంగారం మీద, మేకింగ్ చార్జెస్ మీద కలిపి దేశవ్యాప్తంగా 3 శాతం జీఎస్టీ విధిస్తారు. దిగుమతి చేసుకున్న బంగారం మీద అయితే ఇంపోర్ట్ డ్యూటీ, సెస్ కలిపి 18 శాతం వరకూ పన్ను విధిస్తారు.

Tags:    

Similar News