Viral Video: వామ్మో.. ఇలా కూడా గుడ్డు పెంకులు తీయవచ్చా? భలే ఉందిగా.. మీరు కూడా ట్రై చేసేయండి!
Viral Video: ఉడికిన గుడ్ల పెంకులను తేలికగా తీసేందుకు నిమ్మకాయను మరిగే నీటిలో వేసే ట్రిక్‌ను ట్రై చేయండి.

Viral Video: వామ్మో.. ఇలా కూడా గుడ్డు పెంకులు తీయవచ్చా? భలే ఉందిగా.. మీరు కూడా ట్రై చేసేయండి!
Viral Video: ఉడికిన గుడ్లను తేలికగా పెంకులు మీకు సమస్యగా అనిపిస్తుందా? అయితే మీ కోసం ఇప్పుడు ఇంటర్నెట్‌లో కొత్తగా ట్రెండ్ అవుతోన్న ఒక సింపుల్ టెక్నిక్ వచ్చింది. వినగానే ఆశ్చర్యంగా అనిపించొచ్చు కానీ నిజం. మీరు ఎప్పుడైనా ఉడికే నీటిలో నిమ్మకాయ వేశారా? ఇప్పటికే ఆన్‌లైన్‌లో లక్షల మంది ఈ టెక్నిక్‌కి రెస్పాన్స్ ఇస్తున్నారు. గుడ్లను ఉడికించేటప్పుడు నీటిలో ఒక నిమ్మ ముక్క వేస్తే చాలు, అవి చల్లారిన తర్వాత పెంకు తీయడం ఈజీగా ఉంటుందంటున్నారు. పెంకు చక్కగా జారి వచ్చేస్తుంది. దీన్ని ట్రై చేసినవారు, గుడ్లు విరగకుండా, చక్కగా అందంగా తొక్కుతున్నామంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
ఇక, కొన్ని రోజుల గుడ్లు అయితే ఈ ట్రిక్ మరింత బాగుంటుందట. చాలా మందికి తెలుసు. గుడ్లు చల్లటి నీటిలో వేసి కొంత సేపు ఉంచితే పెంకు సులభంగా ఊడిపోతుంది. కానీ నిమ్మకాయతో ఉడకబెట్టే ఈ కొత్త పద్ధతి ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇలాంటి హ్యాక్‌లు మనకు అవసరమే.. ఎందుకంటే చిన్న విషయాల్లో టైం వృథా కాకుండా ఉండాలంటే ఇలాంటివే ఉపయోగపడతాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వర్కౌట్ అయితే ఇకమీదట నిమ్మకాయ లేకుండా గుడ్లు మరిగించలేరు.
ఇది ఇలా వైరల్ అవుతుంటే, కొంతమంది ఆహార ప్రియులు తమ తమ స్టైల్‌లో ఆల్టర్నేటివ్ టిప్స్‌ను కూడా పంచుకుంటున్నారు. గుడ్లను చల్లటి నీటిలో ఉంచాలని కొంతమంది చెబుతుంటే.. ఇంకొంతమంది వంట నూనె చల్లి ఉడకబెట్టమంటున్నారు. మరికొందరు అయితే ఏకంగా గుడ్లను కప్పులో వేసి షేక్ చేస్తే పెంకు దానంతట అదే వదులుతుంది అంటున్నారు. అట వంటగదిలో చిన్న చిన్న సమస్యలకు ఇలాంటివి ఓ మంచి పరిష్కారంగా మారతాయి. అటు టైం సేవ్ అవుతుంది. ఇటు మనకి కూడా మజాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఊపందుకుంటున్న ఈ చిట్కాను మీ వంటింట్లో ట్రై చేసి చూడండి. ఒకసారి క్లిక్ అయిందంటే... ఇక మీరు కూడా హ్యాక్ మాస్టర్ అవ్వడం ఖాయం!