దీపావళికి సిద్ధమైన వెరైటీ స్వీట్స్

Update: 2019-10-26 16:19 GMT

వెలుగు జిలుగుల పండుగ, రంగురంగుల దీపాల హోళీ,దీపావళి. పిల్లలు, పెద్దలు అంతా కలిసి ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగలలో ఇది ఒకటి. ఈరోజున పూజలతో పాటు ప్రత్యేకంగా నోరూరించే స్వీట్లను తినడం, రాత్రి పూట టపాసులు కాల్చడంతో తమ ఆనందోత్సాహాలను వ్యక్తం చేస్తారు. అందుకే నగరంలో ఇప్పుడు వివిధ వెరైటీ స్వీట్లతో దుకాణాలు దర్శమిస్తున్నాయి.

దేశంలో ప్రధానమైన పండుగ దీపావళి. ముఖ్యంగా హైదరాబాద్‌‌కు, ఈ పండుగకు విడదీయరాని బంధం ఉంది. తెలుగు వారే కాకుండా.. మొదటి నుంచి ఇక్కడ స్థిరపడిన గుజరాతీలు, మరాఠీలు, బెంగాలీలు, ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. ఈరోజున బంధువులకు, స్నేహితులకు స్వీట్లను, డ్రై ఫ్రూట్స్‌ను బహుమతిగా ఇవ్వడంతో పాటు.. కుటుంబసభ్యులకు మిఠాయిలను పంచి ఎంతో ఆనందంగా పండుగను ఎంజాయ్‌ చేస్తారు. ఈ క్రమంలో సిటీలో రుచికరమైన స్వీట్లకు మంచి గిరాకి ఉంటుంది.

దీపావళి పండుగ రోజున వివిధ రకాల సంప్రదాయ మిఠాయిలను దుకాణదారులు అందిస్తున్నారు. కాజుతో తయారుచేసిన కాజుకట్లీ స్వీట్, నోరూరించే కాజు పిస్తా రోల్స్‌ తో పాటు, ఇతర డ్రైఫ్రూట్స్‌తో కలిసి రుచికరంగా రూపొందిస్తారు. కోవాతో తయారయ్యే దూద్‌ పేడా, శనగపిండి, ద్రాక్ష, కాజులతో తయారయ్యే మోతి చూర్‌ లడ్డూలు వేటికవే ఎంతో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నాయి. పాలు, చక్కెర, కొన్ని రకాల డ్రైఫ్రూట్స్‌తో బర్ఫీ స్వీట్‌, రుచికరంగా ఉండే గులాబ్‌ జామ్‌లు.. దీపావళి రోజున అందరి ఇంటా నోరూరిస్తుంటాయి.

బాదంలతో తయారయ్యే బాదం బర్ఫీ, వెన్నతో తయారయ్యే రస్‌ మలాయ్‌లు, బెంగాలీ రస్‌గుల్లా.. ఇలా అన్ని రుచిలో వేటికవే సాటి. ఇక స్నేహితులకు గిఫ్ట్ గా ఇవ్వడానికి వివిధ వెరైటీ డ్రై ఫ్రూట్స్‌తో అందంగా తయ్యారు చేసిన గిఫ్ట్ ప్యాక్‌లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం దీపావళి నాడు స్వీట్లను అందిరికీ పంచి, టపాసులు కాలుస్తామని, పండుగ రోజు తీపిని తింటే మంచి జరుగుతుందని నమ్మకం. 

Tags:    

Similar News