Indian Railway: రైల్వే కోచ్‌పై ఈ 5 అంకెలు ఏంటో తెలుసా? ఎమర్జెన్సీలో ఎలా ఉపయోగిస్తారంటే?

భారతీయ రైల్వేలను దేశానికి లైఫ్ లైన్ అని పిలుస్తుంటారు. భారతదేశంలో ప్రయాణం గురించి ప్రస్తావించినప్పుడు, రైల్వే ప్రయాణం లేకుండా అది పూర్తవ్వదు.

Update: 2024-06-06 07:15 GMT

Indian Railway: రైల్వే కోచ్‌పై ఈ 5 అంకెలు ఏంటో తెలుసా?

Train Coach Code: భారతీయ రైల్వేలను దేశానికి లైఫ్ లైన్ అని పిలుస్తుంటారు. భారతదేశంలో ప్రయాణం గురించి ప్రస్తావించినప్పుడు, రైల్వే ప్రయాణం లేకుండా అది పూర్తవ్వదు. సామాన్యుల విమానంగా పేరుగాంచిన భారతీయ రైల్వేలు.. ఆర్థికంగానే కాకుండా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ప్రతిరోజు లక్షల మంది ఈ రైలులో ప్రయాణిస్తుంటారు.

ఒక గమ్యం నుంచి మరొక గమ్యానికి చేరుకోవడానికి, ప్రజలు రైలులో ప్రయాణిస్తుంటారు. ఈ ప్రయాణంలో, వారు ప్రకృతి అందాలను చూస్తూ.. తమ గమ్యానికి చేరుకుంటారు. మీరు మీ టికెట్ బుక్ చేసినప్పుడు, మీకు రైల్వే కోచ్‌లో బెర్త్ నంబర్ ఇస్తుంటారు. కానీ, మీకు బెర్త్ నంబర్ ఉన్న కోచ్‌కి కూడా ఓ నంబర్ ఉందని మీరు ఎప్పుడైనా గమనించారా. ఈ సంఖ్యల అర్థం మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కోచ్‌ను గుర్తించడానికి ఈ నంబర్ ఇస్తుంటారు. వేర్వేరు కోచ్‌లపై వేర్వేరు సంఖ్యలు ఉంటాయి. ఇది ఏ రైలుకు ఏ కోచ్ జోడించబడిందో గుర్తించడానికి రైల్వేలకు సహాయపడుతుంది. ఇవి కోచ్‌కు రెండు వైపులా రాసి ఉంటాయి. తద్వారా ప్లాట్‌ఫారమ్‌కు ఇరువైపులా ఉన్న వ్యక్తులు వాటిని చదివేందుకు వీలుంటుంది.

నెంబర్ ఎలా ఇస్తారంటే..

భారతీయ రైల్వే కోచ్‌కు ఐదు అంకెల సంఖ్యను ఇస్తుంది. దీని ద్వారా ఏ కోచ్‌ను ఏ సంవత్సరంలో తయారు చేశారో, ఏ సీరీస్ ఏ కోచ్ దో రైల్వేకు తెలుస్తుంది. ఈ ఐదు అంకెలలో, మొదటి రెండు అంకెలు ఆ కోచ్ తయారీ సంవత్సరాన్ని సూచిస్తాయి. మిగిలిన అంకెలు దాని శ్రేణి సంఖ్యను సూచిస్తాయి. ఉదాహరణకు, కోచ్ సంఖ్య 08437 అనుకుందాం. కాబట్టి, ఇక్కడ ప్రారంభంలోని రెండు అంకెలు 08 అంటే ఆ కోచ్ తయారు చేసి సంవత్సరం అన్నమాట. అంటే ఈ కోచ్ 2008లో తయారైందన్నమాట. అదే సమయంలో, మిగిలిన సంఖ్య 437 కోచ్ సిరీస్ నంబర్. రైల్వే కోచ్‌లో ఏదైనా సమస్య ఉంటే, సమస్యను పరిష్కరించేందుకు రైల్వే శాఖ ఈ నంబర్‌తో దాన్ని గుర్తిస్తుంది. ఇది కాకుండా, ఒక నిర్దిష్ట కోచ్ ఎంత పాతది, దాని సిరీస్ ఏమిటో కూడా రైల్వేకు తెలుస్తుంది.

Tags:    

Similar News