Viral Video: ఏం ఐడియా గురూ.. వెనకాల నుంచి చూస్తే బస్సు, ముందకెళ్తే మాత్రం..!

ఓ వ్యక్తి చేసిన వినూత్న ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Update: 2024-09-28 09:10 GMT

Viral Video: ఏం ఐడియా గురూ.. వెనకాల నుంచి చూస్తే బస్సు, ముందకెళ్తే మాత్రం.. 

Viral Video: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రపంచంలో జరిగే వింతలన్నీ అరచేతిలో వాలిపోతున్నాయి. ఎక్కడ ఏం జరిగినా వెంటనే చక్కర్లు కొడుతోంది. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా. వింతలు, విశేషాలు.. వినూత్న ఆవిష్కరణలు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఓ వ్యక్తి చేసిన వినూత్న ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.. రోడ్డుపైన ఒక బస్సు వెళ్తుంది. అదే సమయంలో వెనకాల నుంచి వస్తున్న ఓ వ్యక్తి కెమెరాలో బస్సు వీడియో తీశాడు. అయితే అందులో స్పెషాలిటీ ఏముందనేగా మీ సందేహం. అయితే అసలు మ్యాటర్‌ కాస్త ముందుకు వెళ్తే తెలిసింది.

నిజానికి అది కేవలం బస్సు బాడీ మాత్రమే. బస్సులాంటి నిర్మాణాన్ని ట్రాక్టర్‌ ఇంజన్‌ సహాయంతో తీసుకెళ్తున్నారు. బస్సులో ప్రయాణికులు కూడా ఉండడం గమనార్హం. ఈ వీడియో దేవ్‌గఢ్‌లోని ఓ సత్సంగ్‌కు సంబంధించిన బస్సు అని తెలుస్తోంది. ఆ ఆశ్రమానికి భక్తులను ఇదే తరహాలో తీసుకెళ్తారని కొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను లక్షల్లో వీక్షించారు.

ఈ వైరల్ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 3.8 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను వీక్షించారు.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. భలే ఐడియా చేశావు అంటూ కొందరు స్పందించగా మరికొందరు మాత్రం ఇది కచ్చితంగా చట్ట విరుద్దమే కదా అంటూ స్పందిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ట్రాక్టర్‌ బస్సు ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.


Tags:    

Similar News