Tomato Prices: త్వరలో టమోట, బాదం, కాఫీ ధరలు పెరగబోతున్నాయి.. కారణం ఏంటంటే..?

Tomato Prices: త్వరలో టమోట, బాదం, కాఫీ ధరలు పెరగబోతున్నాయి.. కారణం ఏంటంటే..?

Update: 2022-03-18 09:00 GMT

 త్వరలో టమోట, బాదం, కాఫీ ధరలు పెరగబోతున్నాయి.. కారణం ఏంటంటే..?

Tomato Prices: వాతావరణ మార్పులు ప్రపంచ వ్యాప్తంగా అనేక వ్యవసాయ రంగాలపై ప్రభావం చూపుతున్నాయి. బలమైన గాలులు అతివృష్టి, అనావృష్టి, భారీ తుఫానులు అనేక పంటలను ప్రభావితం చేస్తున్నాయి. దాని ఘోరమైన పరిణామాలు ఇప్పుడు కనిపించడం ప్రారంభించాయి. వాతావరణ మార్పుల అతిపెద్ద ప్రభావం టమోటాలు, బాదం, కాఫీ వంటి పంటలపై పడింది.

టమోటా ఉత్పత్తి తగ్గింది

ఐరోపాలో ఇటలీ అతిపెద్ద టమోటా ఉత్పత్తిదారుగా ఉంది. ప్రతి సంవత్సరం సగటున 6 నుంచి 7 మిలియన్ మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తుంది. ఇప్పుడు మరింత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు పండ్ల పెంపకానికి వెచ్చని స్వర్గధామంగా ఉన్న వాతావరణం ఇప్పుడు చల్లగా మారి వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. తక్కువ ఉష్ణోగ్రతలు పండు పక్వానికి వచ్చే ప్రక్రియను నెమ్మదిస్తున్నాయి. 2019లో ఒప్పందం కుదుర్చుకున్న మొత్తంలో సగం కంటే తక్కువ ఉత్పత్తి  చేశారు. ఇది ఇలాగే కొనసాగితే టమోట ధరలు పెరుగుతూనే ఉంటాయి.

సంక్షోభంలో బాదం సాగు

టమోటాలు కాకుండా బాదం, కాఫీ, హాజెల్ నట్స్, సోయాబీన్స్ వంటివి వాతావరణ మార్పుల వల్ల  ఎక్కువగా ప్రభావితమయ్యే కొన్ని ఉత్పత్తులు. కాలిఫోర్నియా ప్రపంచంలోని బాదం ఎగుమతుల్లో 80శాతం ఉత్పత్తి చేస్తుంది. మానవుల శక్తి కోసం ఇవి కచ్చితంగా అవసరం. కాలిఫోర్నియా అంతటా కరువు కారణంగా రైతులు తోటలను వదిలేస్తున్నారు. ఎందుకంటే వాటిని నిలబెట్టుకోవడానికి తగినంత నీరు దొరకదు. కరువు కారణంగా రైతులు బాదంపప్పును వివిధ రకాల పురుగుమందులతో చికిత్స చేయవలసి ఉంటుంది. దీంతో బాదం పప్పుల ధర పెరగవచ్చు.

కాఫీ ధరలు పెరిగే అవకాశం

బ్రెజిల్‌లో కాఫీ ఉత్పత్తి రాబోయే కొన్నేళ్లలో 76 శాతం తగ్గుతుందని అంచనా వేశారు. ఎందుకంటే దేశం పొడిగా మారుతోంది. కాఫీ మొక్కలు తేమ, ఉష్ణమండల వాతావరణంలో బాగా పెరుగుతాయి. నేలలు, ఉష్ణోగ్రతలు దాదాపు 21 °Cకి చేరుకుంటాయి. దీంతో కాఫీ ఉత్పత్తి మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీంతో ధరలు భారీగా పెరుగుతాయి.

Tags:    

Similar News