భారతదేశంలో ఐదు అత్యంత శీతల నగరాలు ఇవే..!

Coldest Cities: శీతాకాలం ఎన్నో అనుభూతులను మోసుకొస్తుంది. వాతావరణం మొత్తం చల్లగా ఉంటుంది.

Update: 2021-12-16 14:15 GMT

భారతదేశంలో ఐదు అత్యంత శీతల నగరాలు ఇవే..!

Coldest Cities: శీతాకాలం ఎన్నో అనుభూతులను మోసుకొస్తుంది. వాతావరణం మొత్తం చల్లగా ఉంటుంది. నులి వెచ్చని సూర్యకిరణాల కోసం ప్రతి ఒక్కరు ఆరాటపడుతారు. ముఖ్యంగా డిసెంబర్‌లో చలి విపరీతంగా ఉంటుంది. అందుకే పర్యాటకులు చల్లటి ప్రదేశాలను సందర్శించేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకొని వెళ్లాలి. లేదంటే తగ్గిన ఉష్ణోగ్రతల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. భారతదేశంలో అత్యంత చల్లగా ఉండే ఐదు ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. లడఖ్ రాజధాని లేహ్ నగరం చలికాలంలో చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎల్లప్పుడు విపరీతమైన చలి ఉంటుంది. కానీ శీతాకాలంలో సాధారణ ఉష్ణోగ్రత -20 డిగ్రీల నుంచి -15 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి. కానీ ఇప్పటివరకు కనిష్ట ఉష్ణోగ్రత -28.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

2. స్పితి ఒక నగరం మాత్రమే కాదు ఇది ఒక లోయ. ఇక్కడ చలి విపరీతంగా ఉంటుంది. ఇది టిబెట్, భారతదేశం మధ్య ఉంటుంది. దాదాపు ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజలు ఇక్కడకు వస్తారు. మీరు ఇక్కడ నిజమైన అందాన్ని వీక్షించాలంటే శీతాకాలం మాత్రమే వెళ్ళండి.

3. ఉత్తర సిక్కిం చలికి ప్రసిద్ధి. ఉత్తర సిక్కింలో లాచెన్, తంగు వ్యాలీలో చలి ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ప్రజలు వేసవి సెలవుల కోసం ఇక్కడికి వెళతారు, అయితే కొంతమంది ధైర్యవంతులు శీతాకాలం అందాలను ఆస్వాదించడానికి కూడా వస్తారు.

4. కార్గిల్ యుద్దానికి పేరుగాంచిన నగరం. కానీ ఇక్కడి అందాలు పర్యాటకుల మనసు దోచుకుంటాయి. ఇది సురు నదికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ శీతాకాలంలో చిక్కటి మంచు కురుస్తుంది.

5. జమ్మూ కశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో ద్రాస్ ఒక చిన్న పట్టణం. ఈ ప్రదేశం నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడ శీతాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రత -45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇక్కడ చలిని భరించడం చాలా కష్టమైన పని.

Tags:    

Similar News