Viral Video: వాటే ఐడియా.. తెలంగాణ పోలీసులు చేసిన పని తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..!

Viral Video: రోడ్డు భద్రతా నియమాలు పాటించడం మనందరి విధి. ట్రాఫిక్‌ పోలీసులు ఉన్నారనో, పోలీసులు ఫైన్‌ వేస్తారనో కాకుండా ఎవరికి వారే స్వయంగా పాటించాలి.

Update: 2024-06-29 06:39 GMT

Viral Video: వాటే ఐడియా.. తెలంగాణ పోలీసులు చేసిన పని తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే..!

Viral Video: రోడ్డు భద్రతా నియమాలు పాటించడం మనందరి విధి. ట్రాఫిక్‌ పోలీసులు ఉన్నారనో, పోలీసులు ఫైన్‌ వేస్తారనో కాకుండా ఎవరికి వారే స్వయంగా పాటించాలి. అయితే మనలో చాలా మంది కేవలం పోలీసులకు భయపడే నిబంధనలు పాటిస్తుంటారు. వీధి చివరల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీసును చూసి హెల్మెట్ ధరిస్తుంటారు, సీట్ బెల్ట్ వేసుకుంటారు.

అయితే ప్రతీసారి పోలీసులు గస్తీకాయడం సులభమైన విషయం కాదు కదా? అందుకే తెలంగాణ పోలీసులు ఓ వినూత్న ఆలోచన చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. వాహనదారులను నిత్యం అలర్ట్‌గా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పోలీసులు పోస్ట్‌ చేసిన వీడియో.. ఓ వ్యక్తి హెల్మెట్‌ ధరించకుండానే రోడ్డుపై వెళ్తుంటాడు. అదే సమయంలో రోడ్డుపై ఓ పోలీస్‌, పక్కనే పోలీసింగ్ వాహనం కనిపిస్తుంది. దీంతో ఇది చూసిన వెంటనే సదరు వ్యక్తి రోడ్డు పక్కన బైక్‌ ఆపుకొని హెల్మెట్‌ ధరిస్తాడు.

అయితే నిజానికి అక్కడ ఉంది ట్రాఫిక్‌ పోలీస్ కాదు, వాహనం అంతకంటే కాదు. కేవలం అదొక కటౌట్ మాత్రమే. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. తెలంగాన పోలీసుల ఐడియాకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి కటౌట్స్‌ కరీంనగర్‌ నుంచి వేములవాడ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి కటౌట్స్‌ వల్ల అయినా వాహనదారులు భయపడి నిబంధనలు పాటిస్తారని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ పోలీసుల ఐడియా భలే ఉంది కదూ!


Tags:    

Similar News