Teacher's Day 2020: ఉపాధ్యాయుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో తెలుసా?

Teacher's Day 2020 | ఉపాధ్యాయుల దినోత్సవం (Teachers' Day) భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబరు 5 తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటాము.

Update: 2020-09-05 03:17 GMT

Sarvepalli Radhakrishnan (File Photo)

Teacher's Day 2020 | ఉపాధ్యాయుడు అంటే ఎలా ఉండాలో తెలియ చెప్పిన వారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. విద్యార్థులతో ఉపాధ్యాయులకు ఎటువంటి సంబంధాలు ఉండాలో ఆయన జీవితం నేర్పిస్తుంది. తన మేధస్సుతో రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని మన దేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. ఉపాధ్యాయునిగా ఆయన అందించిన స్ఫూర్తిని మననం చేసుకుంటూ విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపే రోజు ఈరోజు అసలు ఈరోజే ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు నిర్వహిస్తారో మీకు తెలుసా?

ఉపాధ్యాయుల దినోత్సవం (Teachers' Day) భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం అయిన సెప్టెంబరు 5 తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఈ రోజు శెలవుదినం కాదు. ఉత్సవం జరుపుకొనవలసిన దినం. పాఠశాలలు యధావిధిగా తెరిచి, ఉత్సవాలు జరుపుకుంటాము. ఈ రోజున ఉపాధ్యాయులను జాతీయ, రాష్ట్రీయ మరియు జిల్లా స్థాయిలలో పురస్కారాలు, గౌరవసత్కారాలు జరుగుతాయి. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.

రాజకీయాల్లో రాకముందు ముందు, రాధాకృష్ణన్ చెన్నై ప్రెసిడెన్సీ కళాశాల, కలకత్తా విశ్వవిద్యాలయంతో సహా వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అంతే కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌గా కుడా పనిచేశాడు. తూర్పు మతాలు, నీతి బోధించడానికి 1936 లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆయనకు ప్రతిపాదన వచ్చింది. రాధాకృష్ణన్ ఈ ప్రతిపాదనను అంగీకరించి అక్కడ చాలా సంవత్సరాలు బోధించారు.

బోధనతో పాటు, అయన 1946 నుండి 1952 వరకు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. సోవియట్ యూనియన్‌లో భారత రాయబారిగా కూడా నియమించబడ్డారు. ఆ తరవాత 1952లో అయన భారతదేశపు మొదటి ఉపాధ్యక్షునిగా నియమితులయ్యారు. తరువత 1962 లో భారతదేశపు రెండవ రాష్ట్రపతి అయ్యారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, రాధాకృష్ణన్ ను విద్యార్థులు సంప్రదించి, అయన పుట్టినరోజును జరుపుకోవడానికి అనుమతించమని అభ్యర్థించారు. వారిని అలా అనుమతించకుండా, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా పాటించాలని కోరారు. అప్పటి నుండి ఉపాధ్యాయుల దినోత్సవం ప్రతి సంవత్సరం అయన జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లందరి గౌరవార్థం గుర్తించబడింది.


Tags:    

Similar News