చలికాలంలో పాడి జంతువుల పట్ల జాగ్రత్త.. ఇలా చేయకుంటే పాల ఉత్పత్తి తగ్గుతుంది..

Dairy Animals: శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు పాలిచ్చే జంతువులు తీవ్రంగా ప్రభావితమవుతాయి.

Update: 2021-12-22 15:00 GMT

చలికాలంలో పాడి జంతువుల పట్ల జాగ్రత్త.. ఇలా చేయకుంటే పాల ఉత్పత్తి తగ్గుతుంది..

Dairy Animals: శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు పాలిచ్చే జంతువులు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఫలితంగా జంతువులు తరచుగా జ్వరం, న్యుమోనైటిస్‌కి గురవుతాయి. ఇది జంతువు పాల ఉత్పత్తి, ఆరోగ్యం, పునరుత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఆవు, గేదె సాధారణ శరీర ఉష్ణోగ్రత 101-102 డిగ్రీలు ( ఫారెన్‌హీట్) మధ్య ఉంటుంది. పరిసర ఉష్ణోగ్రత 65-75 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉండాలి. అత్యంత శీతల వాతావరణంలో జంతువులు ఇబ్బందిపడుతాయి. అందుకే అదనపు కేలరీలు ఉండే ఆహారం అందించాలి. శీతాకాలానికి ముందు ఆవులు, గేదెలు ఇతర సీజన్లలో కంటే ఎక్కువ పాలను ఉత్పత్తి చేస్తాయి. ఎందుకంటే ఈ సీజన్‌లో ఉష్ణోగ్రత, జీర్ణమయ్యే పచ్చిగడ్డి అందుబాటులో ఉంటుంది. అయితే ఈ సీజన్‌లో చేయాల్సినవి చేయకూడనివి తెలుసుకుందాం.

సాధారణంగా 100 కిలోల బరువున్న పాడి పశువులకు శరీర బరువు నుంచి ఆరవ వంతుతో కూడిన సమతుల్య ఆహారాన్ని అందించాలి. సాధారణ పాల ఉత్పత్తి, ఇతర కార్యకలాపాలను నిర్వహించడానికి శరీర బరువులో 0.8% ఉన్న తృణధాన్యాలు చలిని ఎదుర్కోవడానికి అదనపు శక్తిని అందించాలి. శుభ్రమైన నీరు రోజుకు నాలుగు సార్లు అందించాలి. చలి కారణంగా జంతువు ఇబ్బంది పడితే తాగేనీరు గోరువెచ్చగా అందించాలి. రాత్రిపూట అవి నివసించే ఇంటిలో కిటికీలకు జనపనార సంచులు కప్పి ఉంచాలి. గాలి, సూర్యకాంతి కోసం పగటిపూట కిటికీలను తెరిచి ఉంచాలి. సరైన వెంటిలేషన్ చాలా ముఖ్యం.

సూర్యరశ్మి పొందడానికి ఉదయం పూట పాడి పశువులను బహిరంగ ప్రదేశంలో కట్టి ఉంచాలి. చలి నుంచి బయటపడాలంటే రాత్రి పూట ఇంటి లోపల ఆశ్రయం కల్పించాలి. దురద, చర్మ వ్యాధులు, ఎక్టోపరాసైట్‌లను నివారించడానికి మధ్యాహ్నం ఎండలో స్నానం చేయించాలి. ఇలా చేస్తే దూడలకు విటమిన్ డి అందుతుంది. పచ్చి మేత ఎక్కువగా ఇవ్వడం మంచిది కాదు. ఎందుకంటే ఇది ఎక్కువ మూత్రవిసర్జనకు కారణమవుతుంది. పచ్చి మేతలో కెరోటిన్ ఉంటుంది. ఇది విటమిన్ ఎగా మారుతుంది. దానికి తగిన నిష్పత్తిలో ఎండు మేత కలపాలి. పశువుల షెడ్లు, పాలు పితికే ప్రదేశాలు, జంతువుల రొమ్ములు శుభ్రపరచడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News