అదిరేటి డ్రస్సు మేమేస్తే.. అంటూ వచ్చిన సెలబ్రిటీ లను చూసి అక్కడ అందరూ నిజంగానే అదిరిపోయారు. భయంకరంగా కొన్ని, బీభత్సంగా మరికొన్ని, నవ్వించేలా కొందరు, బాబోయ్ అనిపించేలా మారిందరు రకరకాల డ్రెస్సులు వేసుకొచ్చి అక్కడ ఉన్నవారిని అదరగొట్టేశారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించిన మెట్ గాలా 2019 వేడుకలో సెలబ్రిటీలు వింతైన దుస్తులతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా వేసుకున్న దుస్తులు, అలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. అయితే, మరో బాలీవుడ్ నటి దీపికా పదుకునే వస్త్రాలంకరణ మాత్రం అదిరిపోయేలా ఉందని అంతా ప్రసంసలు కురిపిస్తున్నారు. దీపికా గులాబీ రంగు గౌనులో బార్బీ బొమ్మలా తయారై అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకలో రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్‌అంబానీ కుమార్తె ఈషా అంబానీ కూడా పాల్గోవడం విశేషం.