Richest Village: ఇంటికో కోటీశ్వరుడు.. బ్యాంకులో రూ. 5వేల కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం మనదేశంలోనే ఉందని తెలుసా?

Richest Village: ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం భారతదేశంలో ఉందని మీకు తెలుసా? మనం మాట్లాడుకుంటున్నది గుజరాత్‌లోని మాధాపర్ అనే చిన్న గ్రామం.

Update: 2024-08-19 13:54 GMT

Richest Village

Richest Village: ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం భారతదేశంలో ఉందని మీకు తెలుసా? మనం మాట్లాడుకుంటున్నది గుజరాత్‌లోని మాధాపర్ అనే చిన్న గ్రామం. కచ్ జిల్లాలో ఉన్న ఈ గ్రామంలో మొత్తం 7600 ఇళ్లు ఉన్నాయి. అయితే, ఇక్కడ ఏకంగా 17 బ్యాంకులు ఉన్నాయి.

మాదాపర్ గ్రామ ప్రజలు మట్టి ఇళ్ళతోపాటు తక్కువ సౌకర్యాలతో జీవించే వారు. కానీ ఇప్పుడు ఇక్కడి ప్రజలు ఆధునిక సౌకర్యాలతో జీవిస్తున్నారు. ఈ చిన్న గ్రామంలో అనేక ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, సరస్సులు, ఆనకట్టలు, దేవాలయాలు ఉన్నాయి. 1990వ దశకంలో, దేశంలో సాంకేతిక విప్లవం సంభవించినప్పుడు, మాదాపర్ హైటెక్ గ్రామంగా మారింది.

ఈ గ్రామం గొప్పదనానికి సంబంధించిన రహస్యం ఏమిటంటే ఇక్కడి ప్రజలు చాలా మంది విదేశాల్లో ముఖ్యంగా బ్రిటన్, అమెరికా, కెనడా మొదలైన దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ జీవిస్తున్నారు. విదేశాల్లో డబ్బు సంపాదించిన తర్వాత కూడా, వారు తమ మూలాలతో ముడిపడి ఉన్నారు. వారి సంపాదనలో ఎక్కువ భాగాన్ని వారి గ్రామాలకు తిరిగి పంపుతున్నారు.

మీడియా నివేదికల ప్రకారం, మాదాపర్ మొత్తం జనాభా దాదాపు 92,000. వీరిలో 65 మంది ఎన్నారైలు అంటే విదేశాల్లో ఉంటూ వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు డబ్బు పంపుతున్నారు. గ్రామంలో ప్రస్తుతం ఉన్న 17 బ్యాంకుల్లో సగటున రూ.5000 కోట్లు జమ అయ్యాయి.

విదేశాలకు వెళ్లే వ్యక్తులు తమ మూలాలను మరచిపోకుండా ఉండేందుకు లండన్‌లో పనిచేస్తున్న వారు 1968లో మధాపర్ విలేజ్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ లక్ష్యం విదేశాలలోనూ గ్రామం ప్రతిష్టను మెరుగుపరచడం, ప్రజలను అనుసంధానం చేయడం. దీని ఫలితమే నేడు ఈ గ్రామం పేరు అందరికీ తెలిసేలా చేసింది.

Tags:    

Similar News