Poco M2: బడ్జెట్ లోనే 6బీజీ ర్యామ్, భారీ బ్యాటరీ వంటి అదిరిపోయే ఫీచర్లతో .. పోకో స్మార్ట్ ఫోన్
Poco M2: స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమి సబ్ బ్రాండ్ పోకో.. ఇవాళ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 6 బీజీ స్మార్ట్ ఫోన్ అతి కూడా అతి తక్కువ బడ్జెట్‌లోనే. అదే.. పొకో ఎం2
Poco M2: స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమి సబ్ బ్రాండ్ పోకో.. ఇవాళ అదిరిపోయే ఫీచర్లతో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 6 బీజీ స్మార్ట్ ఫోన్ అతి కూడా అతి తక్కువ బడ్జెట్‌లోనే. అదే.. పొకో ఎం2. రెండు వేరియంట్లలో, పిచ్ బ్లాక్, స్లేట్ బ్లూ , బ్రిక్ రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్లలో పోకో ఎం2 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. పొకో ఎం2 ఫోన్ 6 జీబీ+ 64 జీబీ, 6 జీబీ+128 జీబీ ఇలా రెండు వేరియంట్లలో వస్తుంది.
మీడియాటెక్ హీలియో జీ80ప్రాసర్, క్వాడ్ రియర్ కెమెరా, భారీ కెమెరా, 6.53-అంగుళాల ఎఫ్ హెచ్‌డీ + స్క్రీన్, అధిక-సామర్థ్యం గల బ్యాటరీ, అదికూడా ఫాస్ట్ చార్జీంగ్ సపోర్టుతో.. అలాగే వాటర్‌ప్రూప్ బాడీ వంటి మరిన్ని అదిరిపోయే ఫీచర్స్ తో వస్తుంది. ఈ ఫోనులో ప్రధాన ఆకర్షణ నిలవనున్నది. కెమెరా.. పోకో ఎం2 వెనుక భాగంలో నాలుగు కెమెరాల సెట్ అంటే క్వాడ్ కెమేరా ఇవ్వబడింది. ఇందులో, 13 ఎంపీ ప్రాధమిక కెమెరా, 118-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 5 ఎంపీ మాక్రో కెమెరా మరియు 2 ఎంపీ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఇక ముందు వైపు, 8ఎంపీ సెల్ఫీ కెమెరా నాచ్ కటౌట్ లోపల ఉంది.
ఇన్ని ఆకర్షించే ప్యూచర్లు ఉన్న ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.10,999 కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.12,499గా ఉండనుంది.సెప్టెంబర్ 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానున్నాయి.
పోకో ఎం2 ఫీచర్స్:
- 6.53 అంగుళాలు స్క్రీన్
- 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్
- ఆండ్రాయిడ్ 10
- మీడియాటెక్ హెలియో జి 80ప్రాసెసర్
- 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
- 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
- 13+ 8+5+2మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం