Photo Puzzle: ఈ ఫొటోలో కుందేలు దాగుంది.. కనిపెట్టగలరేమో ట్రై చేయండి..!
Photo Puzzle: పైన ఉన్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది.? ఏముందు ఒక పెద్ద చెట్ట వేరుల్లు, చిన్న చిన్న రాళ్లు, మొక్కలు అంటారు కదూ! అయితే ఎవరికైనా ఫొటో చూడగానే కనిపించేది ఇవే.. అయితే వీటిలో ఓ కుందేలు దాగి ఉంది.
Photo Puzzle: పజిల్ సాల్వింగ్.. మెదడుకు మేతలా ఉపయోగపడుతుందని తెలిసిందే. అందుకే చిన్నారులకు సుడోకో, చెస్ వంటివి నేర్పించాలని నిపుణులు చెబుతుంటారు. వీటి వల్ల వారిలో ఆలోచనా శక్తి పెరుగుతుంది. అయితే కేవలం చిన్నారులకే కాకుండా పెద్దలు కూడా ఇలాంటి పజిల్స్‌ను సాల్వ్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఒకప్పుడు కేవలం న్యూస్ పేపర్లలో మాత్రమే ఇలాంటి పజిల్ సాల్వింగ్‌కు సంబంధించిన ఫొటోలు వచ్చేవి.
కానీ ప్రస్తుతం మారిక కాలానికి అనుగుణంగా సోషల్ మీడియాలో ఇలాంటి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని మన ఆలోచన శక్తిని పరీక్షించేవి ఉంటే మరికొన్ని కంటి పవర్‌ను టెస్ట్ చేసేవి ఉంటాయి. కళ్ల ముందే కనిపించినా కనిపెట్టలేని ఇలాంటి ఫొటో పజిల్స్‌కు ప్రస్తుతం సోషల్ మీడియాలో భలే డిమాండ్ ఉంది. వీటికి లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. దీంతో సోషల్ మీడియా క్రియేటర్లు సైతం ఇలాంటి వాటిని క్రియేట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఫొటో పజిల్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫోటో పజిల్.? అందులో ఉన్న మ్యాజిక్ ఏంటో ఇప్పడు చూద్దాం.
పైన ఉన్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది.? ఏముందు ఒక పెద్ద చెట్ట వేరుల్లు, చిన్న చిన్న రాళ్లు, మొక్కలు అంటారు కదూ! అయితే ఎవరికైనా ఫొటో చూడగానే కనిపించేది ఇవే.. అయితే వీటిలో ఓ కుందేలు దాగి ఉంది. దాన్ని కనిపెట్టడమే ఈ ఫోటో పజిల్ ముఖ్య ఉద్దేశం. ఇంతకీ మీరు ఆ కుందేలును కనిపెట్టారా.? అచ్చంగా అక్కడే ఉన్న రాళ్లలో కలిసి పోయిందా కుందేలు. దానిని 10 సెకండ్లలో కనిపెడితే మీ కంటి పవర్ సూపర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంత ప్రయత్నించినా కుందేలు కనిపించడం లేదా.? అయితే ఫొటోలో ఓసారి ఎడమవైపు తీక్షణంగా గమనించండి అక్కడే కుందేలు దాగి ఉంది. ఇంత చెప్పినా సాల్వ్ చేయలేకపోతే ఓసారి సమాధానం కోసం కింద ఫొటో చూడండి.