Personality test: మీరు ఎలాంటి వారో ఇట్టే చెప్పొచ్చు.. ఈ ఫొటోలో మొదట ఏం కనిపిస్తోందో చెప్పండి.
Personality test: మీరు ఎలాంటి వారో ఇట్టే చెప్పొచ్చు.. ఈ ఫొటోలో మొదట ఏం కనిపిస్తోందో చెప్పండి.
Personality test: ఒక వస్తువును ఏ ఇద్దరూ ఒకే విధంగా చూడరని తెలిసిందే. ఒక్కొక్కరి దృష్టి కోణంలో నుంచి చూస్తుంటారు. చూసిన దాన్ని అర్థం చేసుకుంటారు. ఇదిగో ఈ దృక్కోణమే మీ ఆలోచనలు ఎలాంటివో చెబుతాయి. మీర ఒక వస్తువును ఎలా చూస్తారన్న దానిబట్టి మీ ఆలోచనలు ఎలాంటివో చెప్పొచ్చు. దీనినే పర్సనాలిటీ టెస్ట్ అంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అలాంటి ఓ ఫొటో గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పైన కనిపిస్తున్న ఫొటోలో రకరకాల అంశాలు దాగి ఉన్నాయి. వీటిలో మీరు మొదట ఏం చూస్తారన్న దానిబట్టి మీరు ఎలాంటి వారో చెప్పొచ్చని అంటున్నారు మానసిక నిపుణులు. ఈ ఫొటోలో ఒక బ్లాక్ టైగర్‌తో పాటు, పక్షి ఉంది. అలాగే జాగ్రత్తగా గమనిస్తే వాటి రెండింటి మధ్య ఒక మహిళ ముఖం కూడా కనిపిస్తోంది. అయితే ఇందులో మీకు మొదట ఏం కనిపించదన్న దాని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు..
* ఒకవేళ మీకు ఈ ఫొటోలో మొదట చిరుతపులి, పక్షి కనిపిస్తే.. మీలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని అర్థం చేసుకోవాలి. మీరు ఇతరుల పట్ల దయతో ఉంటారు. భావోద్వేగాలను ఎల్లప్పుడు కంట్రోల్లో ఉంచుకుంటారు. ఇతరును ఆకర్షించే స్వభావం మీకు ఉంటుంది. మీ నాయకత్వాన్ని ఇతరులు కూడా ఇష్టపడుతుంటారు. అయితే ఇతరులను ఎక్కువగా నమ్ముతుంటారు. ఇది మీలోని వీక్నెస్గా చెప్పొచ్చు.
* ఒకవవేళ ఫొటో చూడగానే మీకు మొదట మహిళ కనిపిస్తే.. మీరు జీవితంలో ఎదురయ్యే ప్రతీ సమస్యను చాకచక్యంగా పరిష్కరిస్తారని అర్థం. ఒత్తిడికి అస్సలు లోనుకారు ఎంత కష్టం ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. మీక ఓర్పు ఎక్కువగా ఉంటుంది. ఇతరులను అర్థం చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే మీలో ముక్కు సూటి తనం ఎక్కువగా ఉంటుంది. మీరు నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్తారు.