Viral Video: భారీ వర్షం తరువాత రోడ్లపై మంచు కురిసినట్లుగా నురగ... ఏంటీ నురగ మిస్టరీ?
White foam on Bengaluru roads: సాధారణంగా కులూ మనాలి, షిమ్లా లాంటి చల్లటి ప్రాంతాల్లో రోడ్లపై మంచు కురిసినప్పుడు ఇలాంటి

Viral Video: భారీ వర్షం తరువాత రోడ్లపై మంచు కురిసినట్లుగా నురగ... ఏంటీ నురగ మిస్టరీ?
Viral video of mysterious white foam on Bengaluru roads: బెంగళూరులో భారీ వర్షం పడి వెలిసింది. ఆ తరువాత ఒక ప్రాంతంలోని రోడ్డుపై అంతా నురగ ఏర్పడింది. చూడ్డానికి అచ్చం మంచు కురిసిందా అన్నట్లుగా రోడ్డు పొడవునా తెల్లటి నురగ కనిపించింది. వచ్చీపోయే వాహనాలు ఆ నురగలోంచి వెళ్తుండటంతో సమయం గడిచే కొద్దీ ఆ నురగ పెరగడం చూసి రోడ్డుపై వచ్చీ పోయే వారు ఆశ్చర్యపోయారు.
అదే సమయంలో అటుగా వెళ్లిన మిలాన్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బెంగూళూరులో ఏం జరుగుతోంది? ఎండా కాలం వాన తరువాత రోడ్లన్నీ ఇలా నురగమయం అయ్యాయి అంటూ ఆ వ్యక్తి తన వీడియో కింద టెక్ట్స్ రాశాడు. ఆ వీడియోకు గంటల వ్యవధిలోనే 90 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. లక్షల్లో వ్యూస్ వచ్చాయి.
సాధారణంగా ఉత్తర భారతదేశంలో కులూ మనాలి, షిమ్లా లాంటి చల్లటి ప్రాంతాల్లో రోడ్లపై మంచు కురిసినప్పుడు ఇలాంటి సీన్స్ దర్శనం ఇస్తుంటాయి. కానీ బెంగళూరులోనూ ఇప్పుడు ఇలాంటి సీన్స్ చూడొచ్చా అని నెటిజెన్స్ ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
అసలు కారణం ఏంటి?
ఈ వీడియో చూసిన తరువాత చాలా మంది రియాక్ట్ అయ్యారు. కానీ వారిలో ఎక్కువ మంది అనుమానించిన కారణం ఒకటుంది... అదేంటంటే, కుంకుడు కాయ చెట్ల పువ్వులు, కాయల వల్ల ఈ నురగ తయారై ఉండొచ్చునని వారు సందేహం వ్యక్తంచేశారు.
ఎక్కడైతే రహదారి పక్కన కుంకుడు కాయ చెట్లు ఉంటాయో, అక్కడ వర్షం పడినప్పుడు ఆ చెట్ల పూవులు, కాయలు రాలడం, వర్షంలో తడిసిన వాటిపై నుండి వాహనాలు వెళ్లడం వల్ల నురగ తయారవుతుందని ఆ దృశ్యాన్ని తరచుగా చూసే వారు చెబుతున్నారు. ఏదేమైనా సోషల్ మీడియాలో ఈ వీడియో చాలామందికి ఒక ఆసక్తిని రేకెత్తించింది.