Viral: భూతద్దంలో చూస్తే కానీ కనిపించని బ్యాగ్‌.. ధర మాత్రం రూ. 55 లక్షలు..!

Viral: సాధారణంగా ఒక హ్యాండ్‌ బ్యాగ్‌ ధర ఎంత ఉంటుంది.? మహా అయితే ఓ పది వేలు లేదా సెలబ్రిటీలు వాడేవి అయితే ఓ రూ. లక్ష ఉంటే ఎక్కువ అంతే కదూ!

Update: 2024-07-10 07:19 GMT

Viral: భూతద్దంలో చూస్తే కానీ కనిపించని బ్యాగ్‌.. ధర మాత్రం రూ. 55 లక్షలు..!

Viral: సాధారణంగా ఒక హ్యాండ్‌ బ్యాగ్‌ ధర ఎంత ఉంటుంది.? మహా అయితే ఓ పది వేలు లేదా సెలబ్రిటీలు వాడేవి అయితే ఓ రూ. లక్ష ఉంటే ఎక్కువ అంతే కదూ! అయితే ఓ హ్యాండ్‌ బ్యాగ్ ధర మాత్రం ఏకంగా రూ. 50 లక్షలకు పైమాటే, హ్యాండ్‌ బ్యాగ్ ధర రూ. 50 లక్షలు ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదూ! ఇంతకీ ఈ హ్యాండ్ కథేంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

రూ. 50 లక్షలు కదా అని ఈ హ్యాండ్‌ బ్యాగ్‌లో ఎంచక్కా అన్ని వస్తువులు పెట్టుకోవచ్చనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే ఈ హ్యాండ్‌ బ్యాగ్‌ను సరిగ్గా చూడాలంటే భూతద్దం ఉండాలి. ఒక చిన్న ఇసుక రేణువు అంత పరిమాణంలో ఉంటుందీ బ్యాగ్‌. ఈ మైక్రో ప్లాస్టిక్‌ బ్యాగ్‌ను Mschf అనే కంపెనీ తయారు చేసింది. ఫోటోపాలిమర్ రెసిన్‌తో తయారు చేసిన ఈ బ్యాగ్ కేవలం 657 * 222 * 700 మైక్రోమీటర్లు కొలతతో ఉండడం ఈ విషయం.

లూయిస్‌ విట్టన్‌ మోనెగ్రామ్‌ ఆన్‌ ది గో హ్యాండ్‌బ్యాగ్‌ నుంచి స్ఫూర్తి పొంది ఈ బ్యాగ్‌ను రూపొందించారు. ఇక ఈ బ్యాగ్‌ను జూన్‌ 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఫారెల్‌ విలియమ్స్‌ యాక్షన్ హౌజ్‌ జూపిటర్‌లో నిర్వహించిన వేలం పాటలో రూ. 55 లక్షలకు కొనుగోలు చేశారు.

ఇలా Mschf కంపెనీ వెరైటీ ప్రొడక్ట్స్‌ను తయారు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. 2016లో స్థాపించిన ఈ పార్టీ నిత్యం ఏదో ఒక వెరైటీ ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఈ మధ్య కాలంలోనే ఈ కంపెనీ మనిషి రక్తంతో తయారు చేశామని చెప్పుకుంటూ షూస్‌ను లాంచ్‌ చేసింది. ఆ సమయంలో ప్రముఖ షూ తయారీ కంపెనీ నైక్‌ ఈ కంపెనీపై కేసు కూడా నమోదు చేసింది.

Tags:    

Similar News