అమ్మ ప్రేమ ముందు అనారోగ్యమూ తలదించాల్సిందే!
నవమాసాలు కడుపున మోసి జన్మనిచ్చిన బిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటుంది.
నవమాసాలు కడుపున మోసి జన్మనిచ్చిన బిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటుంది. జోలాలి అంటూ నిద్రపుచ్చినా.. చందమామాను పిలిచి గోరుముద్దలు కలిపి పెట్టినా.. తప్పటడుగులు పడకుండా తీర్చిదిద్దినా.. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడినా పిల్లలు భవిష్యత్తు కోసమే.. నిరంతరం బిడ్డల ఎందుగుదల కోసమే తల్లి ఆరాటం. ఎక్కడ ఉన్న తన బిడ్డలు సుఖంగా జీవించాలని కోరుకుంటుంది. సమాజంలో తన బిడ్డ ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తుంది, అయితే ప్రతి మనిషి ఎదుగుదలలో, వివిధ రంగాల్లో రాణించడంలో అమ్మ పాత్ర కచ్చితంగా ఉంటుంది. అలాంటి మాతృమూర్తి త్యాగం వెలకట్టలేనిది. అలాంటి తల్లికి బిడ్డలు ఏమిచ్చిన రుణం తీర్చుకోలేనిది.
కాగా.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో బిడ్డల కోసం తల్లి చేసిన త్యాగం గురించి, అలాగే కన్నతల్లిని కనుపాపలే కంటిరెప్పలా చూసుకుంటున్న బిడ్డల గురించి తెలుసుకుందా.. మదర్ డే కానుకగా ఈ ప్రత్యేక కథనం మాతృమూర్తులకు అంకితం ఇద్దాం?
మదర్స్ డే గురించి క్లుప్తంగా తెలుసుకుందాం?
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మదర్స్‌డేను మే రెండో ఆదివారం జరుపుకొంటున్నారు. దీని వెనక కథ చూస్తే మదర్ ఆఫ్ ద గాడ్స్ రియాకు నివాళి అర్పించే కార్యక్రమానికి తొలిసారిగా గ్రీసు దేశస్తులు శ్రీకారం చుట్టారు. ఇంగ్లాండులో తల్లుల గౌరవార్థం 'మదరింగ్ సండే' నిర్వహించే వారు. 1910లో జర్విస్ జ్ఞాపకార్థం యూఎన్‌ఏలోని వర్జీనియా రాష్ట్రం 'మదర్స్‌డే'ను గుర్తించింది. జర్విన్ కుమార్తె దీనికోసం బాగా ప్రచారం చేశారు. 1914లో అమెరికా మదర్స్‌డేను అధికారికంగా ప్రకటించింది.
తల్లడిల్లిన తల్లి గుండె .. బిడ్డకోసం 14 వందల కి.మి పయనం
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తన కుమారుడు వేరే రాష్ట్రంలో చిక్కుకున్నాడని తెలియగానే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. తన కొడుకు కోసం స్కూటీపై సుమారుగా 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. బోధన్‌కు చెందిన రజియాబేగం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు.. తన కుమారుడు నిజాముద్దీన్ ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్ ఓ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్నాడు, నిజాముద్దీన్ స్నేహితుడి తండ్రి ఆరోగ్యం బాగా లేదని నెల్లూరు వెళ్లాడు. దీంతో లాక్ డౌన్ కారణంగా∙చిక్కుకుపోయాడు. విషయం తెలియగానే రజియాబేగం
అధికారుల అనుమతి పత్రం తీసుకుని నెల్లూరు వెల్లింది. తన కొడుకును చూడాలనే ఆకాంక్షరజీయాను అంతదూరం వెళ్లేలా చేసింది. చివరకు కుమారుడిని చూసిన తర్వాత ఆ తల్లి మనస్సు శాంతించింది. కుమారుడిని వెంటబెట్టుకొని తిరిగి స్కూటీపై కామారెడ్డికి చేరుకుంది.
కొడుకును చూడాలనే ఆకాంక్షతో వృధ్థ్యాపంలో బొర్డర్ వరకూ..
కేరళలో ఉంటున్న 50 ఏళ్ల మహిళ 3 రోజుల్లో పాటు 6 రాష్ట్రాలు దాటింది. రాజస్థాన్ వెళ్లి అనారోగ్యంతో ఉన్న తన కొడుకును చూడటానికి 2,700 కి,మీ దూరం ప్రయాణిచింది. బీఎస్ఎఫ్ లో ఉద్యోగం చేస్తున్న అరుణ్ కుమార్ అనారోగ్యంతో భాదపడుతున్నారు, ఈ విషయం తెలిసిన తల్లి కొడుకును చూడాలని కేంద్ర మంత్రి మురళిధరన్ కు కోరారు. తల్లి ఆవేదన అర్థం చేసుకున్న కేంద్ర మంత్రి కొడుకును చూడటానికి అవకాశం కల్పించారు.
బిడ్డ శవాన్ని గుండెకు హత్తుకుని 25 కిలోమీటర్ల నడిచిన తల్లి
అనారోగ్యంతో ఉన్న కొడుకును పిల్లాడికి జలుబు, దగ్గు ఉంది. చికిత్స కోసం తండ్రి గిరిజేష్ అతడిని కుర్థాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అరవల్ జిల్లాలోని సహోపూర్ గ్రామంలో నివసిస్తుంది. కానీ, అక్కడి డాక్టర్లు అతడిని జహానాబాద్ ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. లాక్ డౌన్ కారణంగా వాహనాలు లేవు. దీంతో వారు విషమ పరిస్థితుల్లో ఉన్న బాలుడిని పట్నాకు తీసుకెళ్లమని చెప్పారు. అంబులెన్స్ దొరకలేదు. దాంతో ఆ బాబు మృదిచెందాడు. బిడ్డను గుండెలకు హత్తుకుని 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామానికి నడిచి వెళ్తుండడం కనిపించింది. ఈ ఘటన చూసిన వాళ్లందరికి మనసు కలిచివేసింది. కన్నీళ్లు ఆగలేదు.
ఇక కన్న తల్లి భారం అయిందని వదిలించునే బిడ్డలను చూశాం. కర్కసంగా వృధ్దాశ్రమంలో వదిలే కొడుకులు ఉంటారు. కానీ, ఏ తల్లి తన బిడ్డలను వదిలేయదు. ఎంత పేదరికంలో కొడుకు కడుపు నిప్పుతుంది. అలాంటి తల్లి రుణం తీర్చుకునేది ఏలా? తమకు ఉన్న లేకున్నా తల్లికి అన్నం పెడతూ.. మహరాణిలా చూసుకుంటున్నా కొందరి బిడ్డల గురించి తెలుసుకుదాం?
కన్నతల్లి దైవం.. కన్నబిడ్డలకు భారం..
విజయవాడకు చెందిన బాషా భార్య చనిపోయింది. బాష తల్లిని వదలి ఉండకపోవడంతో పిల్లలు కూడా వదిలేశారు. కానీ బాషా మాత్రం తన తల్లిని కర్కశంగా వదిలేయలేదు. 15 ఏళ్లుగా తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. తల్లిని దైవంలా భావించి సపర్యలు చేస్తున్నారు. వయసు మీదపడడంతో వాచ్ మెన్ ఉద్యోగం వదిలేశాడు. అద్దె ఇంట్లో బతుకీడుస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా పని దొరకడంలేదు. తిండికి కష్టమవుతుంది. రోజు తను అన్న అర్థిస్తూ.. తల్లి ఆకలి తీర్చుతున్నాడు.
తనకు లేకున్న తల్లికి అన్నం పెడుతూ..
విజయవాడ కృష్ణలంకకు చెందిన రాజాకు ఇల్లులేదు. బస్ షెల్టర్ లో తల్లితో పాటు నివసిస్తున్నాడు. కట్టుకున్న ఇల్లాలు విడిచిపెట్టి వెళ్లినా.. కన్న తల్లిని మాత్రం దూరం చేసుకోలేదు. తల్లికి గొంతు ఆపరేషన్ చేయించాడు. లాక్ డౌన్ కారణంగా పనిలేదు. బస్ షెల్టర్ లో దాతలిచ్చిన ఆహారమే తీసుకుంటూ తల్లిని చూసుకుంటున్నాడు. కనుపాపై కనురెప్పలా తల్లిని చూసుకుంటున్నాడు.
కడుపున మోసిన తల్లిని.. వీపున మోస్తూ..
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామానికి చెందిన రామక్క తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంది. తల్లికి పట్నం తీసుకుళ్లి చూపించాలని కొడుకు రవి భావించాడు. తల్లిని తీసుకుని ఆటోలో బయలుదేరారు. లాక్ డౌన్ కారణంగా ఆటో కళ్యాణదుర్గంకు దూరంలో నిలిచిపోయింది. దీంతో తల్లిని వీపున ఎత్తుకుని ప్రైవేట్ ఆసుపత్రులకు అన్నిటికి తిరిగారు. వైద్యులు ఎవరూ అందుబాటులో లేరు. తల్లిని వీపున ఎత్తుకొని రెండు గంటలపాటు తిరిగిన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని వెనుదిరిగాడు.