Indian Railways: భారతదేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఇదే.. ఎందుకో తెలుసా..?
Indian Railways: మీరు భారతీయ రైల్వేలోని ప్యాసింజర్ నుంచి సూపర్‌ఫాస్ట్ వరకు అన్ని రైళ్లలో ప్రయాణించే ఉంటారు.
Indian Railways: మీరు భారతీయ రైల్వేలోని ప్యాసింజర్ నుంచి సూపర్‌ఫాస్ట్ వరకు అన్ని రైళ్లలో ప్రయాణించే ఉంటారు. అయితే సైకిల్ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు భారతదేశంలో ఉందని మీకు తెలుసా.. అవును మీరు విన్నది నిజమే. ఈ రైలుని ఇండియన్ రైల్వే నడుపుతోంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, బుల్లెట్ ట్రైన్ నడిచే ఈ రోజుల్లో కూడా ఈ రైలుని ఎందుకు నడిపిస్తున్నారో ఈ రోజు తెలుసుకుందాం.
తమిళనాడుకు చెందిన మెట్టుపాళయం ఊటీ నీలగిరి ప్యాసింజర్ తక్కువ స్పీడుతో అందరిని ఆకర్షిస్తుంది. ఇది 5 గంటల్లో కేవలం 46 కి.మీల దూరాన్ని మాత్రమే చేరుకుంటుంది. దీని వేగం గురించి చెప్పాలంటే గంటకు 10 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇది భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు కంటే 16 రెట్లు నెమ్మదిగా నడుస్తుంది. కొండ ప్రాంతంలో పరుగెత్తడం వల్ల దీని వేగం తగ్గి 5 గంటల్లో 46 కి.మీ.లు మాత్రమే వెళుతుంది.
యునెస్కో వెబ్‌సైట్ ప్రకారం.. నీలగిరి మౌంటైన్ రైల్వేను 1854లో నిర్మించాల్సి ఉండగా కొండ ప్రాంతాల సమస్య కారణంగా 1891లో ప్రారంభించి 1908లో పూర్తి చేశారు. కొత్త టెక్నాలజీతో ఈ రైలు 326 మీటర్ల నుంచి 2,203 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుందని యునెస్కో తెలిపింది. ఈ రైలు మెట్టుపాళయం రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 7.10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు ఊటీకి చేరుకుంటుంది. ఈ రైలులో ఫస్ట్, జనరల్ క్లాస్ కోచ్‌లు రెండూ ఉన్నాయి.