Voter ID Address Change: ఓటర్ ఐడీలో అడ్రస్ తప్పుగా ఉందా.. ఈ విధంగా మార్చుకోండి..!
Voter ID Address Change, How to Change Address in Voter ID, Voter ID Address Change Online Process, Voter ID Changes
Voter ID Address Change: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13న అందరూ ఓటు వేయాలి. ఇందుకోసం ఓటర్ ఐడీ కలిగి ఉండాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం అప్లై చేసుకోవచ్చు. యువత ఇప్పటివరకు ఎవరైనా అప్లై చేసుకోపోతే వెంటనే అప్లై చేసు కోండి. ఇదిలా ఉంటే కొంతమంది ఓటర్ ఐడీ కార్డుల్లో అడ్రస్ తప్పుగా ఉంటుంది. లేదంటే కొన్నిసార్లు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఇలాంటి సమయంలో ఆన్‌లైన్‌లో అడ్రస్ ఎలా మార్చుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.
మీరు మొదటిగా ఆన్ లైన్ లోకి వెళ్లి నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. ఇందులో ఫారం 8 కనిపిస్తుంది. దీని ద్వారానే ఓటర్లు తమ ఐడీల్లో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఇంటి చిరునామా, ప్రస్తుతం కార్డుపై వివరాల్లో మార్పులు, కొత్త ఓటర్ ఐడీ కార్డు కావాలన్నా ఇదే ఫారం సమర్పించాల్సి ఉంటుంది. ముందుగా https://voters.eci.gov.in/ లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీరు అకౌంట్ లేకపోతే సైన్ అప్ చేసుకోవాలి. మీ ఫోన్ నంబర్, ఈ మెయిల్, అడ్రస్, క్యాప్చాను ఎంటర్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లాగిన్ అవ్వాలి. అప్పుడు మీరు సైట్లోకి వెళ్తారు.
హోమ్ స్క్రీన్ మెనూలో ఫారం-8పై క్లిక్ చేయాలి. ‘షిఫ్టింగ్ ఆర్ రెసిడెన్స్/కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రోరల్ రోల్/రిప్లేస్ మెంట్ ఆఫ్ ఈపీఐసీ/ మార్కింగ్ ఆఫ్ పీడబ్ల్యూడీ’ అని రాసి ఉంటుంది. దానిపై ఫారం8 కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. వెంటనే మరో పేజీలోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఆ దరఖాస్తు ఎవరికోసం అని అడుగుతుంది. ‘సెల్ఫ్’ ‘అదర్ ఎలక్టర్’ ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. అప్లికేషన్ మీ కోసమే అయితే సెల్ప్ అని, వేరొకరి అయితే అదర్ ఎలక్టర్ అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి.
ఆ తర్వాత ఓటరు ఐడీ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అప్పుడు దానిని ఎంటర్ చేయాలి. తర్వాత మీకు మరో డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. అందులో పేరు ఇతర వివరాలు కనిపిస్తాయి. అవన్నీ మీవే అని నిర్ధారించడానికి ఓకే బటన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఓపెన్ అయిన స్క్రీన్ పై షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. తర్వాత అసెంబ్లీ నియోజక వర్గం పరధిలోన లేక బయట నివాసం ఉంటున్నారా అని అడుగుతుంది. మీ నివాస స్థానాన్ని బట్టి దీనిని ఎంచుకోవాలి.
అప్పుడు మీకు ఫారం 8 కనిస్తుంది. అందులో మూడు పార్టులు ఉంటాయి. సెక్షన్ ఏ లో రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ/పార్లమెంట్ నియోజకవర్గం ఎంచుకోవాల్సి ఉంటుంది. సెక్షన్ బీలో వ్యక్తిగత వివరాలు అంటే పేరు వంటివి పూర్తి చేయాలి. సెక్షన్ సీలో మీరు మార్చుకోవాలనుకుంటున్న చిరునామాను పూరించి, దరఖాస్తును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ డీలో డిక్లరేషన్ ఉంటుంది. సెక్షన్ ఈలో రివ్యూ, సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. అయితే మార్చుతున్న చిరునామాను తగినట్లుగా ఓ రుజువు పత్రాన్ని సమర్పించాలని గుర్తుంచుకోండి.