International Yoga Day 2020: ''యోగా'' ఎందుకు చేయాలంటే?
ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా యోగా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం!
ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా యోగా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం!
"యోగా" అనగానే ఒళ్ళంతా ఇష్టం వచ్చినట్టు తిప్పేయడం అని అనుకుంటాం మనలో చాలా మంది. లేకపోతె తలకిందికి కాళ్ళు పైకి పెట్టి నుంచోవడం అని భ్రమ పడతాం. కనీ.. ఇది ఓ సనాతన వ్యాయామ పధ్ధతి. "యోగా" మనిషిని తనను తాను అత్యున్నత స్థానానికి తీసుకుపోగల అద్భుత సాంకేతిక పరిజ్ఞానంగా చెబుతారు పండితులు. నిజానికి "యోగా" అంటే 'ఐక్యం' అని అర్థం. అంటే మనం అన్నిటితో ఐక్యం అయిపోవడం అన్నమాట.
ఆషామాషీ కాదు..
"యోగా" అంటే సాధారణ వ్యాయామం అని చాలామంది భావన. కానీ , అది తప్పు. కేవలం ఆరోగ్యం కోసమే అయితే రెండు మైళ్ళు పరిగెట్టినా.. ఏదైనా ఆటలు ఆడినా సరిపోతుంది. "యోగా" అందుకు పూర్తి భిన్నమైనది. మనసును ఉల్లాసపరిచేది. శారీరకంగా ధృఢత్వాన్ని ఇచ్చేది. ఆత్మతో ముదిపెట్టుకుని చేయాల్సిన ప్రక్రియ "యోగా". ''ఇది చాలా శక్తివంతమైన జీవన మార్గం. ఇది ఎవరి మీదో అధికారం చెలాయించే శక్తి కాదు. ఇది జీవితాన్ని తెలుసుకునే శక్తి.'' అంటారు సద్గురు. మనసు పెట్టి..క్రమం తప్పకుండా యోగా చేస్తే అది మనిషిని అన్నివిధాలుగానూ ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుందని మహర్షులు చెబుతారు.
యోగాతో కలిగే ప్రయోజనాలు అపారమైనవని యోగా గురువులు చెబుతారు.. అవి ఏమిటంటే..
- యోగా వల్ల శారీరకంగా, మానసికంగా ధృఢంగా మారతాం.
- ఆత్మవిశ్వాసం, స్వీయ క్రమశిక్షణ అలవడతాయి.
- రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- శ్వాసక్రియలో ఇబ్బందులు తొలగిపోతాయి.
- తలనొప్పి, మైగ్రేన్ అంటే పార్శపు నొప్పి తగ్గి పోతుంది.
- జీర్ణ సమస్యలు కూడా దరిచేరవు.
- కంప్యూటర్ వర్క్ చేసేవారు మెడనొప్పు, వెన్ను నొప్పి, తలనొప్పులతో బాధపడతారు. అలాంటి వారు కొన్ని ఆసనాలు వేయడం వల్ల అలాంటి సమస్యలు అన్నింటినీ దూరం చేసుకోవచ్చు.
- మోకాళ్ల నొప్పులు, శరీరాన్ని ఇబ్బంది పెట్టే మరికొన్ని కూడా దూరం అవుతాయి. - ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపక శక్తి, గ్రహణశక్తి పెరుగుతుంది.
- భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి.
- యోగాభ్యాసం ద్వారా శరీరంలో ఆక్సిజన్‌తో కూడిన రక్తం శరీరమంతా విస్తరిస్తుంది. - యోగా చేస్తున్నప్పుడు ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్లు విడుదల అవుతాయి.
- కొవ్వు నిల్వలు సమతుల్యంగా ఉంటాయి.
- బరువు తగ్గుతారు.
- సైనస్, ఎలర్జీ సమస్యలు దూరం అవుతాయి.
- వృద్ధాప్య ఛాయలు దూరమై యవ్వనంగా కనిపిస్తారు.
- శరీరం రిలాక్స్ అవ్వడం వల్ల నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి.