Viral News: కువైట్‌లో రెస్టారెంట్ ఓపెన్ చేసిన ఇండియన్.. టిక్‌టాక్‌లో ప్రమోషన్ వీడియో.. కట్‌చేస్తే.. ఊహించని షాక్..!
Indian Restaurant: తన బిజినెస్‌ను ప్రమోషన్ చేసుకోవాలని భారీ ప్లాన్ వేసి, మరీ చేజేతులా సర్వ నాశనం చేసుకున్నాడో ఓ మనిషి.
Indian Restaurant: తన బిజినెస్‌ను ప్రమోషన్ చేసుకోవాలని భారీ ప్లాన్ వేసి, మరీ చేజేతులా సర్వ నాశనం చేసుకున్నాడో ఓ మనిషి. బిజినెస్‌తోపాటు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అసలు వివరాల్లోకి వెళ్తే.. కువైట్ దేశంలో ఓ భారత రెస్టారెంట్‌ను ఓపెన్ చేసిన యజమాని.. అనుమతు లేకుండా నడిపిస్తున్నాడు. ఇన్నాళ్లు అధికారులకు తెలియకుండా సీక్రెట్‌గా నడిపిస్తున్నాడు. దీనిని నడిపేది ఓ భారతీయ పౌరుడు. అయితే, ఫుడ్ బాగుండడంతో జనాలు కూడా చాలామందే వస్తున్నారు.
అయితే, దీనిని బాగా ప్రమోషన్ చేయాలని ప్లాన్ చేసిన ఓనర్.. టిక్‌టాక్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇది అటు తిరిగి, ఇటు తిరిగి పోలీసులు, అధికారులకు చేరింది. ఆ వెంటనే దీనిని అక్రమంగా నడిపిస్తున్నట్లు వారు గుర్తించారు. వెంటనే రంగంలోకి పోలీసులు, అధికారులు యాజమాన్యాన్ని, ఉద్యోగులను అరెస్ట చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
గల్ఫ్ న్యూస్ వివరాల మేరకు.. కువైట్‌లో నడుస్తున్న ఈ రెస్టారెంట్ చట్ట పరంగా అనుమతులు లేకుండా నడుస్తోంది. ఈ కారణంగా ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. ఈ రెస్టారెంట్‌లో ప్రభుత్వ సబ్సిడీ వస్తువులను అమ్ముతున్నారంట. సేఫ్టీ రూల్స్ కూడా పాటించడంలేదు. దీంతో ఈ భారతీయ రెస్టారెంట్‌ను మూసేయాలని అధికారులు ఆదేశించారు. ఈ రెస్టారెంట్ నిర్వాహకుడు సాల్మియాను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారిని భారత్‌కు పంపించారంట.