Free Travel Train: ఈ రైలులో ఫ్రీ జర్నీ... టీసీ లేని ఏకైక ట్రైన్ ఎక్కడుందో తెలుసా?

Bhakra Nangal Free Travel Train: భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా పేరుగాంచాయి.

Update: 2024-06-11 05:30 GMT

Free Travel Train: ఈ రైలులో ఫ్రీ జర్నీ... టీసీ లేని ఏకైక ట్రైన్ ఎక్కడుందో తెలుసా?

Bhakra Nangal Free Travel Train: భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా పేరుగాంచాయి. రైల్వేలో ప్రయాణించే వారి సంఖ్య భారతదేశంలోనే అత్యధికం. ప్రపంచంలోనే ఇంత పెద్ద రైలు నెట్‌వర్క్‌గా మారిన భారతీయ రైల్వే.. మరెన్నో రికార్డులను కూడా సొంతం చేసుకుంది. అలాగే, భారతీయ రైల్వేలను దేశానికి లైఫ్ లైన్ అని చెబుతుంటారు.

భారతీయ రైల్వేలు ఆర్థికంగానే కాకుండా చాలా సౌకర్యవంతంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతిరోజు లక్షల మంది రైళ్లల్లో ప్రయాణిస్తుంటారు. ఒక గమ్యం నుంచి మరొక గమ్యానికి చేరుకోవడానికి, ప్రజలు రైలులో ప్రయాణిస్తుంటారు. అయితే, రైలులో ప్రయాణించాలంటే కచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందే. టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తే జరిమానా విధిస్తారు.

దేశంలో ఒక రైలు నడుస్తోంది. అయితే, అందులో ప్రయాణం పూర్తిగా ఉచితం అని తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రైలులో టిక్కెట్లు తనిఖీ చేయడానికి టికెట్ కలెక్టర్ అస్సలు రాడు లేదా ఎవరూ ఎక్కడా టిక్కెట్లు కూడా అడగరు.

భారతదేశంలోని ఈ ప్రత్యేకమైన రైలు పేరు భాక్రా-నంగల్ రైలు. 75 ఏళ్లుగా ప్రజలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ రైలు పంజాబ్-హిమాచల్ సరిహద్దులోని భాక్రా నుంచి నంగల్ వరకు నడుస్తుంది. ఈ ప్రయాణం మొత్తం 13 కి.మీ.లు ఉంటుంది. ఈ ప్రయాణంలో శివాలిక్ కొండల అందం కనిపిస్తుంది.

ఈ రైలు యాజమాన్యం ఇండియన్ రైల్వేస్ మాత్రం కాదండోయ్.. భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు వద్ద ఉందంట. ఈ రైలు డ్యామ్‌కు సంబంధించిన సిబ్బందిని రవాణా చేయడానికి ప్రారంభించారు. అయితే సాధారణ ప్రజలు కూడా ఇందులో ఉచితంగా ప్రయాణించవచ్చు.

భాక్రా-నంగల్ రైలు 1948లో ప్రారంభమైంది. డ్యాం వద్దకు చేరుకోవడానికి మార్గం లేకపోవడంతో దీన్ని ప్రారంభించారు.

ఈ రైలు అనేక హిందీ సినిమాలలో కూడా కనిపిస్తుంది. మీరు ఈ రైలును రాజేష్ ఖన్నా చిత్రం చల్తా 'పుర్జా'లో చూడొచ్చు.

Tags:    

Similar News